Home » Business news
అంతర్జాతీయ పరపతి రేటింగ్ సంస్థ మూడీస్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026-27) భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను భారీగా పెంచింది. గతంలో ఈ వృద్ధి రేటు 6 శాతం వరకు ఉంటుందన్న ఈ సంస్థ ఇప్పుడు ఈ అంచనాలను 7 శాతానికి పెంచింది.
దేశీయంగా మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) విభాగం శరవేగంగా వృద్ధి చెందుతోందని భారత మ్యూచువల్ ఫండ్స్ సమాఖ్య (యాంఫీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ ఎన్ చలసాని అన్నారు. శుక్రవారం నాడిక్కడ ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎంఎఫ్ రంగం ఏటా 20 శాతం వరకు వృద్ధిని నమోదు చేస్తూ వస్తోందని, ఈక్విటీ మార్కెట్లపై ప్రజలకు అవగాహన పెరుగుతుండటంతో పాటు అందుకనుగుణంగా పెట్టుబడి సాధనాలు ఉండటం ఈ రంగానికి కలిసి వస్తోందన్నారు.
ఇవాళ్టి వారాంతపు (శుక్రవారం) ట్రేడింగ్ సెషన్‌లో భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు మిశ్రమ సంకేతాలతో ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ గ్రీన్‌లో ముగియగా, బీఎస్ఈ సెన్సెక్స్ స్వల్ప నష్టాలను నమోదు చేసింది.
పాస్‌పోర్ట్ నిబంధనల్లో పలు కీలక మార్పులు చేసింది కేంద్రం. ముఖ్యంగా పిల్లల పాస్‌పోర్ట్ చెల్లుబాటు గడువును పరిమితి మేరకు సవరించింది.
కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శుక్రవారం పుంజుకున్నాయి. ఉదయం 10:30 గంటల సమయానికి ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,580 పెరిగి రూ.1,54,570కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,450 పెరిగి రూ.1,41,700గా ఉంది.
పండగల సీజన్ నగల వ్యాపారులకు పెద్దగా కలిసొచ్చే సూచనలు కనిపించడం లేదు. ఆగస్టు చివరి వారంలో పుంజుకున్న అమ్మకాలు.. ఇటీవల బాగా తగ్గాయి.
అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచడంతోపాటు ఈ ఏడాది మరోసారి పెంపు ఉండవచ్చన్న సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో గురువారం సెన్సె క్స్, నిఫ్టీలు మిశ్రమంగా ముగిశాయి.
టాటా మోటార్స్.. తన వాణిజ్య వాహనాల ధరలను 1 శాతం మేర పెంచింది. పెంచిన ధరలు అక్టోబరు 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ తన హెచ్‌ఐవీ ఔషధాల పోర్టుఫోలియోను పటిష్ఠం చేసుకుంటోంది. ఇందులో భాగంగా త్వరలో ఏడాదికి ఒకసారి ఉపయోగించినా హెచ్‌ఐవీ సోకకుండా అడ్డుకునే లెనాకెపావిర్ అనే ఔషధాన్ని తయారు చేయనుంది.
దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించేందుకు ఈ ఏడాది జూలై లో ప్రకటించిన ‘సెమీకాన్ 2.0’ పథకం ద్వారా పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గురువారం ఢిల్లీలో ప్రారంభమైన సెమీకాన్ ఇండియా, 2026 సదస్సులోనే దీనికి సంబంధించి 1,100 కోట్ల డాలర్ల నుంచి 1,200 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.05 లక్షల కోట్ల నుంచి రూ.1.15 లక్షల కోట్లు) పెట్టుబడుల ఒప్పందం కుదిరే అవకాశం ఉందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.