Stock Market: వరుసగా మూడో రోజూ నష్టాలే.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Sep 24 , 2025 | 10:09 AM
అమెరికా అధ్యక్షుడు హెచ్1బీ వీసాల విషయంలో తీసుకున్న నిర్ణయం ఐటీ రంగ షేర్లను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది. అలాగే డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి బలహీనపడడం, ఇండియన్ ఈక్వెటీ మార్కెట్లు ఓవర్ వెయిట్ జోన్‌లో ఉన్నట్టు హెచ్‌ఎస్‌బీసీ ప్రకటించడంతో మదుపర్లలో ఆందోళన కలిగిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు హెచ్1బీ వీసాల విషయంలో తీసుకున్న నిర్ణయం ఐటీ రంగ షేర్లను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది. అలాగే డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి బలహీనపడడం, ఇండియన్ ఈక్వెటీ మార్కెట్లు ఓవర్ వెయిట్ జోన్‌లో ఉన్నట్టు హెచ్‌ఎస్‌బీసీ ప్రకటించడంతో మదుపర్లలో ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో సోమ, మంగళ వారాల్లో నష్టాలను చవిచూసిన సూచీలు బుధవారం కూడా అధే దోరణిలో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి (Indian stock market).
మంగళవారం ముగింపు (82, 102)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 400 పాయింట్లకు పైగా కోల్పోయింది. ప్రస్తుతం ఉదయం 10:05 గంటల సమయంలో సెన్సెక్స్ 295 పాయింట్ల నష్టంతో 81, 810 వద్ద కొనసాగుతోంది. మళ్లీ 82 వేల మార్క్ దిగువకు వచ్చేసింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 75 పాయింట్ల నష్టంతో 25, 094 వద్ద కొనసాగుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో ఏబీ క్యాపిటల్, కేన్స్ టెక్నాలజీస్, కెనరా బ్యాంక్, మారుతీ సుజుకీ, మాజగాన్ డాక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). అశోక్ లేలాండ్, ఫియోనిక్స్ మిల్స్, భారత్ ఫోర్జ్, కోఫోర్జ్ లిమిటెడ్, కేఈఐ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 170 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 184 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.70గా ఉంది.
ఇవి కూడా చదవండి..
మ్యాచ్ ఓడినా యుద్ధంలో గెలిచాం.. పాక్ క్రికెటర్ భార్య సంచలన పోస్ట్..
ఫర్హాన్ గన్ పేలిస్తే.. అభిషేక్, గిల్ బ్రహ్మోస్ ప్రయోగించారు: పాక్ మాజీ క్రికెటర్
మరిన్ని క్రీడా, అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..