-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy latest Breaking news across globe 24th sept 2025 vreddy
-
BIG BREAKING: బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
ABN , First Publish Date - Sep 24 , 2025 | 06:25 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Sep 24, 2025 20:52 IST
తిరుమల శ్రీవారి ఆలయంలో సీఎం చంద్రబాబు
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
పట్టువస్త్రాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
పెద్ద శేష వాహనసేవలో పాల్గొననున్న చంద్రబాబు కుటుంబసభ్యులు
-
Sep 24, 2025 20:50 IST
హైదరాబాద్: బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
26న బతుకమ్మ కుంట ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
29న సరూర్‌నగర్ స్టేడియంలో బతుకమ్మ ఉత్సవం
గిన్నిస్ బుక్ రికార్డు లక్ష్యంగా 10 వేలమందితో బతుకమ్మ ఉత్సవం
-
Sep 24, 2025 18:27 IST
బిహార్ ఎన్నికల తర్వాతే బీజేపీ జాతీయ నూతన అధ్యక్షుని ఎంపిక
బీజేపీ జాతీయ అధ్యక్షుని రేసులో శివరాజ్‌సింగ్ చౌహాన్, ధర్మేంద్ర ప్రధాన్
బిహార్ ఎన్నికల్లో విజయంపై దృష్టి సారించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం
బిహార్ ఎన్నికల తర్వాతే కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం
-
Sep 24, 2025 18:27 IST
జయవాడ ఉత్సవ్‌లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
దేశానికి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
అన్ని రంగాల్లో ఏపీ దూసుకుపోతోంది: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
విద్య, వైద్యం, టూరిజంలో ఏపీ అభివృద్ధి చెందుతోంది: రాధాకృష్ణన్
-
Sep 24, 2025 17:03 IST
పట్నాలో బిహార్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన రాహుల్
రాజ్యాంగంపై దాడి జరుగుతోంది: రాహుల్ గాంధీ
దేశవ్యాప్తంగా పౌరుల హక్కులు హరిస్తున్నారు: రాహుల్
దేశంలో కుల ఆధారిత జనగణన జరుగుతోంది: రాహుల్
50 శాతం రిజర్వేషన్ల గోడను కూల్చివేస్తాం: రాహుల్
-
Sep 24, 2025 16:27 IST
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
స్వాగతం పలికిన గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు
కాసేపట్లో దుర్గమ్మను దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి
విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొననున్న ఉపరాష్ట్రపతి
విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
దుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
కాసేపట్లో విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొననున్న ఉపరాష్ట్రపతి
-
Sep 24, 2025 16:27 IST
విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
దుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
కాసేపట్లో విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొననున్న ఉపరాష్ట్రపతి
-
Sep 24, 2025 16:03 IST
నేడు విజయవాడకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొననున్న ఉపరాష్ట్రపతి
సా.4:50కి దుర్గమ్మను దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి
సా.5గంటలకు పున్నమి ఘాట్‌కు రాధాకృష్ణన్
ఇంద్రకీలాద్రిపై సాయంత్రం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
రా.8గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి
-
Sep 24, 2025 16:03 IST
బిహార్ ఎన్నికల వేళ కేంద్రం బొనాంజా
కీలక రైల్వే ప్రాజెక్టులు, హైవేల నిర్మాణాలకు ఆమోదం
రూ.95వేల కోట్ల ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం
షిప్పింగ్ ఇండస్ట్రీకి రూ.69,725 కోట్లు కేటాయింపు
నేషనల్ షిప్ బిల్డింగ్ మిషన్ కింద ఆధునీకరణ
-
Sep 24, 2025 15:29 IST
రైల్వే ఉద్యోగులకు కేంద్రం దసరా, దీపావళి బోనస్
78 రోజుల బోనస్ ప్రకటించిన కేంద్రం
గ్రూప్ C, D ఉద్యోగులకు బోనస్
10.91 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం
బోనస్ కోసం రూ.1,866 కోట్లు కేటాయింపు
-
Sep 24, 2025 15:25 IST
లడఖ్ రాజధాని లేహ్‌లో తీవ్ర ఉద్రిక్తత
బీజేపీ ఆఫీస్ ముట్టడికి ఆందోళనకారుల యత్నం
బీజేపీ ఆఫీస్‌కు నిప్పుపెట్టిన ఆందోళనకారులు
లడఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్
పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం, తోపులాట
-
Sep 24, 2025 15:25 IST
ఛత్తీస్‌గఢ్: దంతెవాడ జిల్లాలో మావోయిస్టులకు భారీ షాక్
పోలీసుల ఎదుట లొంగిపోయిన 71 మంది మావోయిస్టులు
లొంగిపోయినవారిలో 30 మందిపై రూ.64 లక్షల రివార్డ్
-
Sep 24, 2025 15:25 IST
ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్
నారాయణపూర్, గుమ్లా జిల్లాల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి
భారీగా ఆయుధాలు స్వాధీనం, కొనసాగుతున్న కూంబింగ్
లొంగిపోయిన వారిలో 30 మందికి రూ.64 లక్షల రివార్డు
-
Sep 24, 2025 15:25 IST
సినిమాకు ఎదురుదెబ్బ..
పవన్ కల్యాణ్ 'O G' సినిమాకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ
బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంపు మెమో సస్పెన్షన్
'O G' సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ..
తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను సస్పెండ్ చేసిన టీజీ హైకోర్టు
-
Sep 24, 2025 13:13 IST
రెండు బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
ఆక్వా డెవలప్‌మెంట్ అథారిటీ సవరణ బిల్లుకు ఆమోదం
గ్రామ, వార్డు సచివాలయాల సవరణ బిల్లుకు ఆమోదం
-
Sep 24, 2025 12:50 IST
గ్రూప్-1 పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట
గ్రూప్-1 ఫలితాలపై సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
గ్రూప్-1 నియామకాలు జరుపుకోవచ్చని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
హైకోర్టు తీర్పుతో TGPSCకి భారీ ఊరట
తదుపరి విచారణ అక్టోబర్ 16కి వాయిదా వేసిన హైకోర్టు డివిజన్ బెంచ్
-
Sep 24, 2025 12:25 IST
ఏపీ శాసనమండలి నుంచి వైసీపీ సభ్యుల వాకౌట్
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ విగ్రహాలను అనుమతిలేకుండా ఏర్పాటు చేశారన్న టీడీపీ సభ్యులు
టీడీపీ సభ్యుల వ్యాఖ్యలపై వైసీపీ అభ్యంతరం
నిరసనగా మండలి నుంచి వాకౌట్ చేసిన వైసీపీ
-
Sep 24, 2025 12:11 IST
బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు సోనూసూద్
-
Sep 24, 2025 11:58 IST
ప్రభుత్వ పాఠశాలల యూనిఫాం కాంట్రాక్ట్‌పై మంత్రి లోకేష్
యూనిఫాం కాంట్రాక్ట్ చేనేతలకు ఇవ్వాలని గతంలో ప్రయత్నాలు చేశాం
చేనేత ద్వారా పూర్తిస్థాయిలో యూనిఫాంలు ఇవ్వడం వీలు కావడం లేదు
ఆప్కో వంటి సంస్థ కూడా యూనిఫాం విషయంలో చేతులెత్తేసింది
గతంలో కంటే నాణ్యమైన వస్త్రాన్ని యూనిఫాం కోసం వాడుతున్నాం
చేనేతల ఆదాయం పెంచేందుకు మంగళగిరిలో వీవర్స్ శాల ఏర్పాటు
కొత్త డిజైన్లు, బ్రాండింగ్, ప్రమోషన్ దిశగా చర్యలు చేపట్టాం: మంత్రి లోకేష్
ఎమ్మెల్యేలతో బృందం ఏర్పాటు చేసి చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేలా చర్యలు: లోకేష్
-
Sep 24, 2025 11:16 IST
జగన్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ అక్టోబర్ 4కు వాయిదా
అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలివ్వాలని జగన్ పిటిషన్
కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు
-
Sep 24, 2025 10:58 IST
విశాఖ: ఆర్టీసీ బస్సులో మరో గుండెపోటు మరణం
68కే బస్సులో గుండెపోటుతో వెంకట సుబ్బారావు
బస్సు అప్పన్నపాలెం నుంచి పెందుర్తికి వస్తుండగా ఘటన
నిన్న ఆర్టీసీ బస్సులో కండక్టర్ ఈశ్వరమ్మ, పగడాలమ్మ మృతి
-
Sep 24, 2025 10:58 IST
ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై కమిటీ వేశాం: డిప్యూటీ సీఎం పవన్
ఉన్నతాధికారులు, మత్స్యకారుల ప్రతినిధులు, స్థానిక నేతలతో కమిటీ
మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించా: పవన్
నష్టపరిహారం చెల్లింపుపై కమిటీ చర్చిస్తుంది: డిప్యూటీ సీఎం పవన్
కమిటీ నివేదిక వచ్చాక ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది: పవన్
ఉప్పాడ మత్స్యకారుల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తా: పవన్
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత..
స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో చర్చిస్తా: డిప్యూటీ సీఎం పవన్
-
Sep 24, 2025 10:33 IST
హైదరాబాద్: పవన్ కల్యాణ్ నటించిన OG సినిమా టికెట్ల బ్లాక్ దందా
ఇందిరానగర్‌లో బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్,
రూ.800 టికెట్లను.. రూ.2,500కు విక్రయిస్తున్న వ్యక్తి, 25 టికెట్లు స్వాధీనం,
కేసు నమోదు చేసిన పోలీసులు
-
Sep 24, 2025 10:27 IST
రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌లో తెలంగాణ సీఐడీ సోదాలు
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో తనిఖీలు చేపట్టిన సీఐడీ
8 మందిని అదుపులోకి తీసుకున్న సీఐడీ
హార్డ్‌డిస్క్‌లు, ఎలక్ట్రానిక్ సామగ్రి స్వాధీనం
-
Sep 24, 2025 10:04 IST
ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కీలక వ్యాఖ్యలు
నోబెల్ బహుమతి కావాలంటే గాజాలో మారణహోమాన్ని ట్రంప్ ఆపి తీరాలి,
గాజాల యుద్ధానికి ఫ్రాన్స్ ఆయుధాలు పంపించట్లేదు.. అమెరికానే సాయం చేస్తోంది: మెక్రాన్
-
Sep 24, 2025 09:43 IST
గుంటూరు జిల్లాలో 10కి చేరిన కలరా కేసులు
ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న వివిధ ప్రాంతాల బాధితులు
కృష్ణా జిల్లా నుంచి వచ్చిన రోగికి కలరా సోకినట్టు గుర్తింపు
గుంటూరులో కొనసాగుతోన్న వైద్య శిబిరాలు
-
Sep 24, 2025 09:40 IST
హైదరాబాద్: విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్‌పై సస్పెన్షన్ వేటు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన అంబేద్కర్
ఇప్పటికే అంబేద్కర్‌ను కస్టడీకి కోరిన ఏసీబీ అధికారులు
అంబేద్కర్ రూ.100కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టు గుర్తింపు
అంబేద్కర్ బినామీ ఇంట్లో రూ.2కోట్లు స్వాధీనం
-
Sep 24, 2025 09:18 IST
భారత్‌పై టారిఫ్ అంశంపై స్పందించిన అమెరికా మంత్రి మార్కో రూబియో
రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకే భారత్‌పై టారిఫ్‌లు: రూబియో
భారత్‌తో టారిఫ్ విభేదాలు త్వరలోనే పరిష్కరించుకుంటాం: రూబియో
-
Sep 24, 2025 08:30 IST
తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ స్మితా సబర్వాల్ పిటిషన్
కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ నివేదికలో తన పేరు తొలగించాలని పిటిషన్
BRS హయాంలో సీఎం ప్రధాని కార్యదర్శిగా చేసిన స్మిత
ఇప్పటికే స్మితా సబర్వాల్‌ను ప్రశ్నించిన జస్టిస్ ఘోష్ కమిషన్
మూడు బ్యారేజీల నిర్మాణంతో తనకు సంబంధం లేదన్న స్మిత
సీఎం అనుమతి కోసం వెళ్లే ఫైల్స్ పరిశీలించడం,..
అందులో లోపాలను సరిచేయడం వరకే తన పాత్ర అని చెప్పిన స్మిత
త్వరలో విచారణకు రానున్న స్మిత సబర్వాల్ పిటిషన్
-
Sep 24, 2025 08:19 IST
నేడు ఏపీ అసెంబ్లీలో రెండు బిల్లులు పెట్టనున్న ప్రభుత్వం
ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ సవరణ బిల్లు,..
గ్రామ, వార్డు సచివాలయ చట్ట సవరణ బిల్లును పెట్టనున్న ప్రభుత్వం
నేడు శాసనమండలిలో మెడికల్ కాలేజీలపై చర్చ
-
Sep 24, 2025 08:19 IST
ప్రతిపక్ష హోదాపై మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్
తాను గతంలో వేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే..
తన విజ్ఞప్తిని తిరస్కరిస్తూ స్పీకర్ రూలింగ్ ఇచ్చారని పేర్కొన్న జగన్
స్పీకర్ రూలింగ్‌ను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని జగన్ పిటిషన్
తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరిన జగన్
జగన్ పిటిషన్ 2 రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం
-
Sep 24, 2025 07:56 IST
నేడు పార్టీ ముఖ్యనేతలతో వైఎస్ జగన్ కీలక సమావేశం
ప్రస్తుత రాజకీయాలపై చర్చించనున్న వైఎస్ జగన్
-
Sep 24, 2025 06:52 IST
హెచ్-1 బీ వీసా కార్యక్రమంలో మార్పులను ప్రతిపాదించిన అమెరికా
అధిక నైపుణ్యం, అధిక వేతనాలు పొందేవారికే ప్రాధాన్యం
లాటరీ విధానంలో కీలక మార్పుల దిశగా చర్యలు
మార్పుల ప్రతిపాదనలను విడుదల చేసిన ఫెడరల్ రిజిస్ట్రార్
హెచ్-బీ కోసం లాటరీ విధానాన్ని మార్చాలని అమెరికా నిర్ణయం
వార్షిక పరిమితి 85 వేలు దాటితే వేతనస్థాయి ఆధారంగా ఎంపిక
సెలక్షన్‌పూల్‌లో 4 సార్లు ఎక్కువ వేతనం కలిగినవారి అర్జీలు
అధిక జీతం ఉన్నవారికి వీసా లభించే అవకాశం ఎక్కువ
కొత్త ప్రతిపాదనలపై 30 రోజుల్లో ప్రజాభిప్రాయ సేకరణ
2026లో 502 మిలియన్ డాలర్లకు పెరగనున్న వేతనాలు
2027లో బిలియన్ డాలర్లు, 2028లో 1.5 బిలియన్ డాలర్లు
2029లో 2 బిలియన్ డాలర్లకు చేరనున్న వేతనాలు
-
Sep 24, 2025 06:51 IST
నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
సా.5:43 నుంచి 6:15 మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణంతో ఉత్సవాలు
నేటి నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
భక్తులకు 16 రకాల వంటకాలు పంపిణీ చేయనున్న టీటీడీ
ఇవాళ సతీసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు
రాత్రి పెద్దశేష వాహనసేవలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
పెద్దశేష వాహనంతో ప్రారంభం కానున్న శ్రీవారి వాహనసేవలు
-
Sep 24, 2025 06:51 IST
ఇంద్రకీలాద్రిపై ఇవాళ మ.3 గంటల నుంచి వీఐపీ దర్శనాలు రద్దు
నేడు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ రాకతో VIP దర్శనాలు రద్దు
-
Sep 24, 2025 06:50 IST
నేడు 3 జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
పశ్చిమ గోదావరి, కృష్ణా, తిరుపతి జిల్లాల్లో చంద్రబాబు టూర్
పాలకొల్లులో మంత్రి నిమ్మల కుమార్తె వివాహ కార్యక్రమానికి హాజరుకానున్న చంద్రబాబు
విజయవాడలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు స్వాగతం పలకనున్న చంద్రబాబు
తిరుమలలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు
రేపు తిరుమలలో AI ఆథారిత కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం
శ్రీవారి ప్రసాదాలకు మిషన్ ప్లాంట్ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
-
Sep 24, 2025 06:25 IST
నేడు గ్రూప్-1 అప్పీల్‌పై TG హైకోర్టులో విచారణ
సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసిన TGPSC
గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రద్దు చేస్తూ..
ఈ నెల 9న తీర్పు ఇచ్చిన సింగిల్ బెంచ్
తీర్పును సవాల్ చేస్తూ రిట్ పిటిషన్
నేడు హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్‌లో విచారణ