Stock Market: వరుసగా నాలుగో రోజూ నష్టాలే.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Sep 25 , 2025 | 10:50 AM
విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలకు దిగుతుండడంతో దేశీయ సూచీలు వరుసగా నాలుగో రోజు కూడా నేల చూపులు చూస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు హెచ్1బీ వీసాల విషయంలో తీసుకున్న నిర్ణయం, డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి బలహీనపడడం నెగిటివ్‌గా మారాయి.
విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలకు దిగుతుండడంతో దేశీయ సూచీలు వరుసగా నాలుగో రోజు కూడా నేల చూపులు చూస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు హెచ్1బీ వీసాల విషయంలో తీసుకున్న నిర్ణయం, డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి బలహీనపడడం, ఇండియన్ ఈక్వెటీ మార్కెట్లు ఓవర్ వెయిట్ జోన్‌లో ఉన్నట్టు హెచ్‌ఎస్‌బీసీ ప్రకటించడం దేశీయ సూచీలకు నెగిటివ్‌గా మారాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి (Indian stock market).
బుధవారం ముగింపు (81, 715)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 150 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఒక దశలో లాభాల్లోకి వచ్చింది. ఆ తర్వాత వెంటనే నష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుతం ఉదయం 10:40 గంటల సమయంలో సెన్సెక్స్ 185 పాయింట్ల నష్టంతో 81, 529 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 51 పాయింట్ల నష్టంతో 25, 004 వద్ద కొనసాగుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో ఆయిల్ ఇండియా, కేపీఐటీ టెక్, కేఫిన్ టెక్, వేదాంత, టిటాగర్ రైల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). టాటా మోటార్స్, ఆస్ట్రాల్ లిమిటెడ్, ఇన్ఫో ఎడ్జ్, పేటీఎమ్, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్ షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 53 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 33 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.64గా ఉంది.
ఇవి కూడా చదవండి..
పెంపుడు కుక్క ఎంత పని చేసింది.. పెద్దలు ఇంట్లో లేని సమయంలో దారుణం..
ఆకుల మధ్యలో కప్ప.. 6 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లకు తిరుగులేనట్టే..
షాకింగ్ సీన్.. చూస్తుండగానే రోడ్డు ఎలా కూలిపోయిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..