Home » BRS
కేటీఆర్ అండ్ కో తెలంగాణకు మంచి చేయరని... తాము చేస్తుంటే అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కేటీఆర్ వ్యాపారవేత్తలను బెదిరించారని ఆరోపించారు.
భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మృతిచెందారు. హైదరాబాద్ నగరంలోని గోల్నాక డివిజన్‌కు చెందిన బోయపల్లి లింగంగౌడ్(66) ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే.. పరిస్థితి విషమించడంతో ఆయన మృతిచెందాడు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమిపై ఆ పార్టీ కార్యకర్తలు సంచలన ఆరోపణలు చేశారు. కొందరి వల్లే పార్టీ ఓడిపోయిందంటూ వ్యాఖ్యలు చేశారు.
వ్యవసాయ మంత్రికి రైతన్నలపై ప్రేమ ఉంటే నిన్న(సోమవారం) జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో స్పష్టమైన హామీ ఎందుకు ఇవ్వలేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. దమ్ముంటే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 20వేలు ప్రకటించాలని సవాల్ చేశారు కేటీఆర్.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ దక్కలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నాలుగు ముక్కలైందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలను విమర్శించేందుకు కూడా తమకు నోరు రావట్లేదని దెప్పిపొడిచారు.
జాగృతి జనం బాటలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులని దీర్ఘకాలం ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు.
కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేశారంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. జై తెలంగాణ అంటూ కవిత సమాధానమిచ్చారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో ప్రజలు చెప్పిన వాటి ఆధారంగానే తాను ఆరోపణలు చేసినట్లు చెప్పుకొచ్చారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి 12 ఏళ్లు అయినా మెదక్ జిల్లా ప్రజల బతుకులు మారలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో జరిగే అరాచకాలు కేసీఆర్‌కు తెలియవని వాపోయారు. సామాజిక తెలంగాణ సాధననే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. గ్రూప్ వన్ ఉద్యోగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ విజయోత్సవతీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం శుక్రవారం రాత్రి యూసుఫ్‌గూడలో పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహించాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్‌కు తాము గట్టి పోటీ ఇచ్చామని మాజీ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. బీఆర్ఎస్కి 38 శాతం పైగా ఓటింగ్ వచ్చిందని వివరించారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ నేతలు నిబంధనలని తుంగలో తొక్కారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.