Home » BRS
తెలంగాణ ఉద్యమానికి బాటలు వేసింది చింతమడక అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఉద్ఘాటించారు. ఇవాళ(ఆదివారం) సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వరద ముంపు బాధితులను రేవంత్ రెడ్డి పట్టించుకోలేదని మండిపడ్డారు. తలసాని తనవంతు సహాయంగా బస్తీ వాసులను ఆదుకుంటున్నారని తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మోదీ ప్రభుత్వానిది మెతక వైఖరి అని మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు. కేసీఆర్‌ను కాళేశ్వరం కేసు నుంచి తప్పించే అవకాశం ఉందని విమర్శించారు.
భూపాలపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే దంపతుల ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణా నడుస్తోందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు
వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇప్పించి, వడ్డీ ప్రభుత్వం కడుతోందని మంత్రి సీతక్క వెల్లడించారు. 95 శాతం మహిళలు సక్రమంగా తీసుకున్న ఋణాలు చెల్లిస్తున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, ఎమ్మెల్యే హరీష్ రావు సోషల్ మీడియా, సంతోష్ రావు సీక్రెట్ మీడియా తన మీద దాడి చేస్తున్నారని కవిత ఆరోపించారు. అందరూ తననే.. టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు.
కల్వకుంట్ల కవిత మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. హరీష్ రావు టార్గెట్‌గా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే భారీ అవినీతి జరిగిందని ఆరోపించారామె. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆమె..
రేవంత్‌రెడ్డిది రాతిగుండె కాకపోతే ఒక్కడిగా వచ్చి ఒక అరగంట చిక్కడపల్లి లైబ్రరీలో చదవండి, నిరుద్యోగ విద్యార్థుల సమస్య తెలుస్తుంది అని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. నిరుద్యోగుల సమస్యలు తెలుసుకోవడానికి శుక్రవారం సాయంత్రం ఆయన చిక్కడపల్లిలోని హైదరాబాద్ నగర కేంద్రగ్రంథాలయానికి వచ్చారు.
హైడ్రా ఎందుకు తెచ్చామో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసునని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. కేసీఆర్, కేటీఆర్‌కి వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయని.. అందుకే హైడ్రాపై ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
షాడో సీఎం ఆరోపణలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. షాడో సీఎం ఎవరో ఆ వ్యక్తి పేరు, చేసిన పని ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఆరోపణలు ఎన్నో చూశానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు.