Home » BJP
మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీప నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని కూమటి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీపీపీ విధానంలో రెండేళ్లలోనే మెడికల్ కాలేజీలను పూర్తిచేస్తామని ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు.
ఈసారి ఆర్జేడీ, కాంగ్రెస్ గెలిచే సీట్లు తగ్గవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఆ ప్రకారం చూసినప్పుడు గత ఎన్నికల్లో మహాగఠ్బంధన్లోని ఆర్జేడీ, కాంగ్రెస్ సాధించిన సీట్లు ఈసారి తగ్గే అవకాశం ఉంది.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, శివకుమార్‌ల క్యారికేచర్లతో కృత్రిమ మేథస్సును ఉపయోగించి రూపొందించిన ఈ వీడియో 26 సెకన్ల పాటు ఉంది. ఇందులో రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య కలిసి డీకే శివకుమార్‌కు 'హాయ్' అంటూ వాట్సాప్ మెసేజ్ పంపుతారు.
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే ఆదినారాయణ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. వైసీపీ అంతమయ్యే పార్టీ అంటూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అవినీతి, అక్రమాలపై చర్చకు సిద్ధం అంటూ సవాల్ విసిరారు.
ఇద్దరు సభ్యుల బీజేపీ.. ఇప్పుడు దేశంలోనే ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీగా నిలవడంలో ప్రవాసీల పాత్ర మరువరానిదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్థిరపడిన ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులతో కలిసి భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా ఆత్మీయ సమ్మేళనాన్ని సోమాజిగూడలోని ఓ హోటల్లో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారం జోరుగా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్టుగా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో ఏ పార్టీ గెలుస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే ఈ ఎన్నికలో మహిళల ఓట్లు కీలకంగా మారునున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ నెల 11న ఉపఎన్నిక ఉన్న నేపథ్యంలో స్కూళ్లకు, కాలేజీలకు, ఆఫీసులకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు కింది వార్తలో చదవండి.
ఆలూరు నియోజకవర్గంలో జడ్పీటీసీ, పలువురు సర్పంచ్‌లు.. వైసీపీకి రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్.. వీరందరికీ కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
హైదరాబాద్‌లో ఎన్నికల పండుగ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మరో 4రోజులే మిగిలిఉండడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారంలో స్పీడ్ పెంచారు. జనసమీకరణ కోసం ఒక్కో వ్యక్తి రూ.400 నుంచి రూ.500 ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కింది కథనంలో చదవండి.
హర్యానా ఎన్నికల్లో బ్రెజిలియన్ మోడల్ ఫోటోగ్రాఫ్‌ను వివిధ పేర్లతో వాడుకున్నారని రాహుల్ చేసిన ఆరోపణలను కూడా రిజిజు తోసిపుచ్చారు. 25 లక్షల నకిలీ ఓట్లున్నాయని రాహుల్ చెప్పడాన్ని రాజకీయ ఉద్దేశాలతో అల్లిన డ్రామాగా ఆయన అభివర్ణించారు.