Share News

జాతీయ జెండా మన ఎజెండా: ఏపీ బీజేపీ ఛీప్ మాధవ్

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:54 PM

బీజేపీ కార్యాలయంలో ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలు జరిగాయి. 'జాతీయ జెండా మన ఎజెండా' అంటూ తొలి ఓటరుకు ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షడు పి.వి.ఎన్ మాధవ్ జాతీయ జెండాను అందించారు.

జాతీయ జెండా మన ఎజెండా: ఏపీ బీజేపీ ఛీప్ మాధవ్
National Voters Day

విజయవాడ, జనవరి 25: ఇవాళ(జనవరి 25) జాతీయ ఓటరు దినోత్సవం. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఎన్నికలు, ఓటు విలువను తెలియజేస్తూ.. అధికారులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలానే ఏపీ బీజేపీ కార్యాలయంలో ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం వేడుకలు జరిగాయి. 'జాతీయ జెండా మన ఎజెండా' అంటూ తొలి ఓటరుకు ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పి.వి.ఎన్ మాధవ్ జాతీయ జెండాను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..' ప్రపంచ దేశాల అన్నింటిలో మన దేశంలోనే పురాతన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. మన దేశంలో రాజుల కాలంలో కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో గ్రామాల్లో ఓటింగ్ జరిగింది. దీని గురించి చాణిక్యుని అర్థ శాస్త్రంలో ప్రస్తావన ఉంది. అలానే అమెరికా కన్నా భారతదేశంలోనే ఓల్డ్ డమోక్రసీ ఉంది. మన దేశంలో మూడు రకాల ఎన్నికలలో ఓటు వేస్తాం.


196 దేశాలకు 50 దేశాల్లో కూడా మూడు రకాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంగ్లాండ్ లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మరోవైపు చైనాలో ఎన్నికలే లేవు. మన యువత ప్రజాస్వామ్యం రక్షించేందుకు పోరాటం చేయాలని పిలుపునిస్తున్నాము. ప్రజాస్వామ్య వ్యవస్థలో నేటి తరం అంతా ఓటు విలువ, వారి హక్కులు తెలుసుకోవాలి. ఓటు ప్రాథమిక హక్కు, ఓటు వేసిన వారికే సంక్షేమ పథకాలను అందించాలి. బీఆర్ అంబేద్కర్ విజ్ఞాన వంతుడు.. అందువల్ల రాజ్యాంగం సమగ్ర రచన జరిగింది. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓటు నమోదు జరుగుతుంది , ఆథార్ కార్డు, ఫొటో ఇస్తే ఓటు నమోదు చేస్తారు' అని ఆయన తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

చిల్లర పనులకు రాలేదు

అమరావతిని అడ్డుకోలేరు

Updated Date - Jan 25 , 2026 | 03:59 PM