Home » Bhanu Koganti
విజయవాడ బీసెంట్ రోడ్డులో చిరు వ్యాపారిగా జీవనం సాగిస్తున్న దుర్గారావు సమస్యను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి ట్వీట్ చేయడంతో మంత్రి నారా లోకేశ్ దృష్టికి చేరింది. ఆ ట్వీట్ ఆయన మనసును కదిలించింది.
దేశంలో నియోజకవర్గాల పునర్విభజన, ఎంపీ సీట్ల పెంపుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో.. ఒక సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. ఎంపీల సంఖ్య పెంచడం కంటే, క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువగా ఉండే రాష్ట్రాల ఎమ్మెల్యేల సంఖ్యను పెంచితే సరిపోతుంది కదా? అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పింఛన్ ఇప్పించే ఏర్పాటు చేస్తానంటూ స్వయంగా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినా.. ఇప్పటికీ నెరవేరలేదంటూ దుర్గారావు అనే దివ్వాంగుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
'రేవతి'. ఈమె ఒక సామాన్య కానిస్టేబుల్. కానీ వ్యవస్థలో తప్పు జరిగినప్పుడు ఏమాత్రం తడబడకుండా, దేనికీ భయపడకుండా నిలిచి చరిత్ర సృష్టించారు. 'జస్టిస్ వర్మ'. ఈయన వ్యవస్థలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి. ఢిల్లీ కరెన్సీ నోట్ల కట్ల కేసులో తన బాధ్యతను గుర్తించడానికి లేదా రాజీనామా నిర్ణయం తీసుకోవడానికి ఆపసోపాలుపడ్డారు.
రాజకీయాల్లో వ్యూహం కంటే ప్రతివ్యూహం ముఖ్యం. ఒక్కోసారి ప్రత్యర్థి వేసే ఎత్తుగడలు ఎంత వింతగా ఉంటాయంటే.. అందులో ఉన్న లాజిక్‌ను పట్టుకోవడానికి రాజకీయ పండితులకు కూడా సమయం పడుతుంది. 'మావిగన్' వ్యవహారం దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్..
గచ్చిబౌలిలోని జీఎంసీ. బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను రూ.700 కోట్ల భారీ వ్యయంతో ఆధునీకరించాలని సీఎం రేవంత్ సర్కార్ నిర్ణయించడం శుభపరిణామం. అయితే.. ఇంతటి భారీ ప్రాజెక్టును చేపట్టే ముందు పారదర్శకత, ప్రజాధనం వృథా కాకుండా చూసుకోవడం ఆవశ్యకం.
ఒక శిశు సంరక్షణ విషయంలో ఇటీవల యూకే కోర్టు చేసిన వ్యాఖ్యలు, దానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ అంశంపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపి నేతలు దాడికి దిగిన ఘటనపై ఆ సంస్థ డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి తీవ్రంగా స్పందించారు. దీనిని ఆయన తీవ్రంగా ఖండిస్తూ ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
నేడు 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవం'. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ చేసిన పోస్ట్.. నెటిజన్లను ఆలోచింపజేస్తోంది.
అంతర్జాతీయ మనస్సాక్షి దినోత్సవం రోజున పశ్చిమాసియా దేశాలు యుద్ధ మేఘాలతో అట్టుడుకుతున్నాయి. ఈ విషయమై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి ఎక్స్ వేదికగా స్పందించారు.