Home » Bengaluru News
తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి పెరిగిపోయింది. సోమవారం జలాశయం నుంచి నదికి 26 గేట్లు ద్వారా 1,07,000 క్యూసెక్కుల నీరు బోర్డు అధికారులు విడుదల చేశారు. కాలవల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండంతో కంప్లి కోటే తుంగభద్ర నది వంతెనపై బరువైన వాహనాలకు అధికారులు నిలిపివేశారు.
నగరంలోని శ్రీరామ నగర్ పరిసరాల్లో సోమవారం బాలిక అక్కనాగమ్మతోపాటు మరో నలుగురు వ్యక్తులు రంగణ్ణ, మంజునాథ్, పూజాల పై నక్క ఆకస్మికంగా దాడి చేసింది. ఆహారం కోసం వెతుకుతూ నగరంలోకి ప్రదవేశించి ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. పరిసరాల్లో ఆడుకుంటున్న బాలికపై నక్క దాడి చేస్తు పక్కనే ఉన్న వ్యక్తుల పై కూడా దాడికి దిగింది.
హత్యకేసులో విచారణ ఖైదీగా పరప్పన అగ్రహార జైలుకు చేరిన నటుడు దర్శన్, పుస్తకాలు చదివేందుకు సిద్ధమయ్యారు. నాలుగురోజులుగా ఏకాంతంగా గడుపుతున్న దర్శన్, పలు పుస్తకాలను తన బ్యారక్‌లో ఉంచుకుని చదువుతున్నట్లు సమాచారం.
ఓ హత్య కేసులో యావజ్జీవ కారాగారశిక్షను అనుభవించి జైలు నుంచి విడుదలైన వ్యక్తి కేవలం 200 రూపాయల కూలి డబ్బులకోసం తోటి కూలీని దారుణంగా హతమార్చిన సంఘటన ఉత్తరకన్నడ జిల్లా శిరసి తాలూకాలో చోటు చేసుకుంది. కమటగేరిలో గురువారం రాత్రి 8.30 గంటలకు కమటగేరి వాజిరాజమఠం సమీపంలో రవీశ్ గణపతి చన్నయ్య, మంజునాథ బసయ్య చన్నయ్యల మధ్య గొడవ జరిగింది.
విద్యార్థి దశలో లా కోర్సు చేయాలని భావించానని కానీ చదువుకునేటప్పుడే పార్టీ టిక్కెట్ ఇచ్చిందని తన ఆశయం నెరవేర్చుకునేందుకు నా కుమారుడిని అడ్వకేట్ చేస్తున్నానని డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు.
ధర్మస్థలలో 13వ పాయింట్లో జీపీఆర్ టెక్నాలజీ స్కానింగ్ చేసిన ప్రదేశంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల దాకా ప్రక్రియ కొనసాగింది. ఓవైపు వర్షం కురుస్తున్నా తవ్విన ప్రాంతంలో నీరు వస్తుండడంతో మోటార్లతో తొలగించి ప్రక్రియ కొనసాగిస్తున్నారు.
ధర్మస్థళ పవిత్రతకు భంగం కలిగించేలా కుట్ర సాగుతోందని 17వ తేదీన బీజేపీ ఎమ్మెల్యేలంతా ధర్మస్థళను సందర్శిస్తామని పార్టీ అధ్యక్షుడు విజయేంద్ర తెలిపారు. బుధవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ మేం బీజేపీ కార్యకర్తలుగా వెళ్లడం లేదని, మంజనాథేశ్వర భక్తులుగా ధర్మస్థళకు వెళ్తున్నామన్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా ఓట్ల చౌర్యంపై పోరాటానికి సిద్ధమయ్యారు. కేంద్రంలోని బీజేపీతోపాటు వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు రాహుల్‌గాంధీ తీరుపై మండిపడుతున్నాయి.
ఇటీవల తుమకూరు జిల్లా కొరటగెరెలో లక్ష్మీదేవి అనే మహిళను ముక్కలుగా కత్తిరించి ప్లాస్టిక్ కవర్లలో వేసి పలుచోట్ల పడేసిన కేసును పోలీసులు చేధించారు. డెంటిస్ట్ అయిన అల్లుడే హంతకుడని పోలీసులు నిర్ధారించారు. దంత వైద్యుడు రామచంద్రప్ప సహా అతడి సహచరులు ఇద్దరిని అరెస్టు చేశారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో సరికొత్త భారత్‌ను ప్రపంచం మొదటిసారి చూసిందని ప్రధాని మోదీ తెలిపారు. భారత భద్రతా బలగాలు పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను కొన్ని గంటల్లోనే మట్టికరిపించాయని పేర్కొన్నారు.