Share News

Bengaluru News: టీటీడీ బెంగళూరు కమిటీ చైర్మన్‌గా కనకమేడల వీరా

ABN , Publish Date - Sep 19 , 2025 | 01:43 PM

బెంగళూరు టీడీపీ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడిగా దశాబ్దకాలానికి పైగా వ్యవహరించిన కనకమేడల వీరాంజనేయులు అలియాస్‌ వీరాను తిరుమల తిరుపతి దేవస్థానం బెంగళూరు కమిటీ చైర్మన్‌గా నియమించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొత్త కమిటీలను నియమించే విషయంలో వాయిదాలు పడుతూ వచ్చింది.

Bengaluru News: టీటీడీ బెంగళూరు కమిటీ చైర్మన్‌గా కనకమేడల వీరా

బెంగళూరు: బెంగళూరు టీడీపీ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడిగా దశాబ్దకాలానికి పైగా వ్యవహరించిన కనకమేడల వీరాంజనేయులు(Kanakamedala Veeranjaneyulu) అలియాస్‌ వీరాను తిరుమల తిరుపతి దేవస్థానం బెంగళూరు కమిటీ చైర్మన్‌గా నియమించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొత్త కమిటీలను నియమించే విషయంలో వాయిదాలు పడుతూ వచ్చింది. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు, డీసీఎం పవన్‌కల్యాణ్‌ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆలయ కమిటీలతో పాటు టీటీడీ లోకల్‌ బాడీలకు కమిటీలను ఖరారు చేశారు.


బెంగళూరులోని వయ్యాలికావల్‌లో వెలసిన టీటీడీ ఆలయం ప్రాచుర్యం పొందింది. ఏటా వివిధ ఉత్సవాలు, నిరంతరంగా సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. బెంగళూరు టీటీడీ ఆలయానికి ప్రాధాన్యం ఉంది. తెలుగుదేశం పార్టీ పట్ల వీరవిధేయుడిగా వీరా దశాబ్దాల కాలంగా పనిచేశారు. బెంగళూరులో నివసించే ఐటీ ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ కోసం సొంతూళ్లలో పనిచేసేందుకు బెంగళూరు తెలుగుదేశం ఫోరంను 12 ఏళ్ల కిందట ప్రారంభించారు.


అప్పటి నుంచి వీరా వ్యవస్థాపక అఽఽధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. కాగా ఫోరంలో ప్రత్యేకంగా ఎవరికీ పదవులు లేకున్నా అందరూ సమైక్యంగా పనిచేస్తారు. ఇలా వీరాకు మాత్రమే పదవి ఉండేది. బెంగళూరు టీటీడీ లోకల్‌ అడ్వైజరీ కమిటీకి బాధ్యత అప్పగించారు. తోటి ఫోరం సభ్యులు ప్రత్యేకంగా వీరాను అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పెరిగిన ధరలకు బ్రేక్..భారీగా తగ్గిన బంగారం, వెండి

శశికళ కేసు హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 19 , 2025 | 01:43 PM