Devegowda: వీల్ చైర్‌లోనే పార్లమెంటుకు వెళ్తా..
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:01 PM
రాజకీయాలనుంచి రిటైర్డు అయ్యేది లేదని, ప్రస్తుతం 93ఏళ్లు అని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అయినా వీల్ చైర్‌లోనే పార్లమెంటుకు వెళ్తానని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. హాసన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెన్నై - బెంగళూరు నేషనల్ ఎక్స్‌ప్రెస్ వే, బెంగళూరు - హైదరాబాద్ హైవేల ప్రాధాన్యత ప్రధానమంత్రికి వివరించానని, వచ్చే బడ్జెట్‌లో ఎక్కువ గ్రాంట్లు రానున్నాయన్నారు.
- రాజకీయాల నుంచి రిటైర్ కాను
- మాజీ ప్రధాని దేవెగౌడ
బెంగళూరు: రాజకీయాలనుంచి రిటైర్డు అయ్యేది లేదని, ప్రస్తుతం 93ఏళ్లు అని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అయినా వీల్ చైర్‌లోనే పార్లమెంటుకు వెళ్తానని మాజీ ప్రధాని దేవెగౌడ(Devegowda) అన్నారు. హాసన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెన్నై - బెంగళూరు నేషనల్ ఎక్స్‌ప్రెస్ వే, బెంగళూరు - హైదరాబాద్ హైవేల ప్రాధాన్యత ప్రధానమంత్రికి వివరించానని, వచ్చే బడ్జెట్‌లో ఎక్కువ గ్రాంట్లు రానున్నాయన్నారు.

కావేరి, కృష్ణా(Kaveri, Krishna) నదుల నీటి కేటాయింపులు, రోడ్ల విస్తరణ అవసరమన్నారు. అస్కర్ ఫెర్నాండెజ్ కాలంలో శిరాడిఘాట్ వద్ద సొరంగమార్గం నిర్మించాలని ప్రతిపాదనలు సూచించానని, అయితే ఇప్పటికీ సాధ్యం కాలేదన్నారు. వయసు పైబడినా రాజకీయ ప్రయోజనాలకోసం మాట్లాడనన్నారు. 65ఏళ్ల పాటు రాజకీయ జీవనంలో కొనసాగానని, రాష్ట్ర అభివృద్ధికి శక్తికి మించి పోరాటం చేశానన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తగ్గిన బంగారం ధరలు..కానీ వెండి మాత్రం
మొదటి పావుగంటలో రిజర్వేషన్లకు ఆధార్
ప్రైవేటు కాలేజీల ఆందోళనలకు సంపూర్ణ మద్దతు
Read Latest Telangana News and National News