Home » HD Deve Gowda
కాంగ్రెస్‌తో 2019లో జరిగిన వివాహం వేధింపుల కారణంగానే విడాకులతో ముగిసిందని మాజీ ప్రధానమంత్రి, జనతా దళ్ సెక్యులర్ చీఫ్ హెచ్‌డీ దేవెగౌడ చెప్పారు.
రాజకీయాలనుంచి రిటైర్డు అయ్యేది లేదని, ప్రస్తుతం 93ఏళ్లు అని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అయినా వీల్ చైర్‌లోనే పార్లమెంటుకు వెళ్తానని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. హాసన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెన్నై - బెంగళూరు నేషనల్ ఎక్స్‌ప్రెస్ వే, బెంగళూరు - హైదరాబాద్ హైవేల ప్రాధాన్యత ప్రధానమంత్రికి వివరించానని, వచ్చే బడ్జెట్‌లో ఎక్కువ గ్రాంట్లు రానున్నాయన్నారు.
మోదీపై పోటీ చేయగలిగే నేత 'ఇండియా' కూటమిలో లేరని, దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడంలో విజయవంతమైన నేతల్లో డొనాల్డ్ ట్రంప్, మోదీ ఉన్నారని మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ అన్నారు. మోదీ-ట్రంప్ మధ్య పటిష్టమైన అనుబంధం ఉందని చెప్పారు.
లైంగిక దాడి, లైంగిక ఆరోపణల కేసులో అరెస్టయిన జేడీ(ఎస్) మాజీ నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్) అరెస్ట్ చేసిన ప్రజ్వల్ కస్టడీ సోమవారంతో ముగిసింది.
కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రజల్వ్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మౌనం వీడారు. ఈ కేసులో మరింత మంది ప్రమేయం ఉందనే సంకేతాలిచ్చారు. ఈ కేసులో ఎవరెవరికి ప్రమేయం ఉందో వారందరిపైన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే వారి పేర్లు తాను చెప్పదలచుకోలేదన్నారు.
మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు, కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు చేదు అనుభవం ఎదురైంది. సామాజిక మాధ్యమాల్లో రేవణ్ణను సంబంధించినట్టు చెబుతున్న ఒక అశ్లీల వీడియో పోస్ట్ కావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బిడది సమీపంలో రోడ్డు పక్కన ఉండే ఆస్తిని రాయించుకునేందుకు 9ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన వారికి ఓటేస్తారా.. అంటూ డీసీఎం డీకే శివకుమార్‌పై పరోక్షంగా మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda) ఆరోపించారు.
లోక్‌సభ ఎన్నికల్లో కుమారస్వామి పోటీపై బీజేపీ అగ్రనేతలు, ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) నిర్ణయం తీసుకుంటారని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda) తెలిపారు.
అయోధ్యకు వెళ్లాలని ఆసక్తిగా ఉందని, ప్రయత్నిస్తానని మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda) తెలిపారు.
మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు తనకు 90 ఏళ్లు అని, వయస్సు పైబడినందున ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు.