Share News

MLA: యోగీ వస్తారు.. అప్పుడు మరింత కఠిన నిర్ణయాలే..

ABN , Publish Date - Sep 19 , 2025 | 01:32 PM

ప్రధానమంత్రిగా ప్రస్తుతం నరేంద్రమోదీ ఉన్నారని భవిష్యత్తులో యోగీ ఆదిత్యనాథ్‌ వస్తారని అప్పుడు మరింత కఠిన నిర్ణయాలు తప్పవని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ వెల్లడించారు.

MLA: యోగీ వస్తారు.. అప్పుడు మరింత కఠిన నిర్ణయాలే..

- ముస్లింలు మా పన్నుల లాభాలు పొందుతున్నారు

- ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌

బెంగళూరు: ప్రధానమంత్రిగా ప్రస్తుతం నరేంద్రమోదీ ఉన్నారని భవిష్యత్తులో యోగీ ఆదిత్యనాథ్‌ వస్తారని అప్పుడు మరింత కఠిన నిర్ణయాలు తప్పవని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌(Vijayapura MLA Basanagouda Patil Yatnal) వెల్లడించారు. దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా మరడి గ్రామంలో గురువారం ధర్మ జాగృతి సమావేశంలో యత్నాళ్‌ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ కంటే ధీటైన నిర్ణయాలు యోగీతోనే సాధ్యం కానున్నాయన్నారు. సీనియారిటీ ప్రకారం నేనే ముఖ్యమంత్రి కావాల్సి ఉండేదన్నారు.


కానీ యడియూరప్ప కుట్రపన్నారన్నారు. రాష్ట్ర రాజకీయాలలో వేటుపడిన వారంతా ముఖ్యమంత్రులు అయ్యారని నేనెందుకు కారాదన్నారు. ఒకప్పుడు యడియూరప్ప దోచుకున్నారని ప్రస్తుతం కుమారుడు విజయేంద్రకు అవకాశం ఇచ్చారన్నారు. రాష్ట్రంలో యడియూరప్ప, శ్యామనూరు శివశంకరప్ప, ఈశ్వర్‌ఖండ్రేల కుటుంబాలు తమ రాజకీయాల కోసం సమాజాన్ని వాడుకుంటున్నారన్నారు. యడియూరప్ప గొడవల వద్దంటారని కానీ ఎందుకు తన స్పష్టత బహిరంగం చేయరని ప్రశ్నించారు.


pandu1.jfif

రాష్ట్రంలో సీఎం సిద్దరామయ్య మైనార్టీలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కేవలం 2028 దాకా సీఎంగా కొనసాగాలని ఆయన ప్రయత్నాలు అన్నారు. దేశంలో హిందువుల జనాభా పెరగాల్సి ఉందన్నారు. నేను ముఖ్యమంత్రి అయితే ముగ్గురు పిల్లలు ఉండే కుటుంబాలకే ఉచిత సౌలభ్యాలు అమలు చేస్తానని వివాహం చేసుకుంటే ఐదులక్షలు ప్రోత్సాహకం ఇస్తానన్నారు. కేజేహళ్ళి, డీజేహళ్ళి కేసులో అప్పటి సీఎం బసవరాజ్‌ బొమ్మై, హోంమంత్రి అరగ జ్ఞానేంద్రలకు అధికారాన్ని దుర్వినియోగం చేశారని అందుకే వారిపై కేసులను ప్రస్తుత సీఎం సిద్దరామయ్య సునాయాసంగా తొలగించారన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పెరిగిన ధరలకు బ్రేక్..భారీగా తగ్గిన బంగారం, వెండి

శశికళ కేసు హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 19 , 2025 | 01:32 PM