Bengaluru News: ఒకే కాన్పులో.. ముగ్గురు శిశువులు
ABN , Publish Date - Sep 20 , 2025 | 12:06 PM
హాసన్ జిల్లా హొళెనరసీపుర తాలూకా దొడ్డకాడనూరు గ్రామానికి చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చారు. హిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. ఆమెకు ఒక మగ శిశువు, ఇద్దరు ఆడ శిశువులు జన్మించారని హిమ్స్ ఆసుపత్రి స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ న్యాన్సీ పాల్ తెలిపారు.
బళ్ళారి(బెంగళూరు): హాసన్(Hasan) జిల్లా హొళెనరసీపుర తాలూకా దొడ్డకాడనూరు గ్రామానికి చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చారు. హిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. ఆమెకు ఒక మగ శిశువు, ఇద్దరు ఆడ శిశువులు జన్మించారని హిమ్స్ ఆసుపత్రి స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ న్యాన్సీ పాల్ తెలిపారు. మగ శిశువు 2.1 కిలోలు, ఆడ శిశువులు1.9 కిలోలు, 1.8 కిలోల బరువు ఉన్నారని ఆమె తెలిపారు.
తల్లి, ముగ్గురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి సమస్యలు లేవని అన్నారు. సాధారణంగా తల్లి తన గర్భంలో 6 నుంచి 6.50 కిలోల బరువు మోయగలరని, కానీ ముగ్గురు శిశువులతో కలిపి ఆమె తన గర్భంలో 8 కిలోలకు పైగా బరువును మోశారన్నారు. అయినా ముగ్గురు శిశువులు, తల్లికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవడం విశేషమని డాక్టర్ న్యాన్సీ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
అదంతా ఫేక్.. ఆ వార్తలను ఖండిస్తున్నా
Read Latest Telangana News and National News