Share News

Bengaluru News: రాజకీయాల్లోకి సీఎం సిద్దరామయ్య మనవడు..

ABN , Publish Date - Sep 16 , 2025 | 11:37 AM

రాజకీయాలలోకి వారసులు రావడం కొత్తేమి కాదు. అయితే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడే సీఎం సిద్దరామయ్య మరో వారసుడు రాజకీయాలలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు చర్చలు జోరందుకున్నాయి.

Bengaluru News: రాజకీయాల్లోకి సీఎం సిద్దరామయ్య మనవడు..

- వరుణ నుంచి బరిలోకి ధవన్‌..

- పట్టుబడుతున్నఅభిమానులు

బెంగళూరు: రాజకీయాలలోకి వారసులు రావడం కొత్తేమి కాదు. అయితే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడే సీఎం సిద్దరామయ్య(CM Siddaraiah) మరో వారసుడు రాజకీయాలలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు చర్చలు జోరందుకున్నాయి. ఇప్పటికే సిద్దరామయ్య కుమారుడు డాక్టర్‌ యతీంద్ర వరుణ నుంచి ఓసారి ఎమ్మెల్యేగా కొనసాగి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే సీఎం మనవడు ధవన్‌ రాకేశ్‌(Dhavan Rakesh)ను రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.


pandu3.3.jpg

సిద్దరామయ్య రాజకీయ వారసుడిగా పెద్ద కుమారుడు రాకేశ్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నించారు. అయితే రాకేశ్‌ అకాలమరణం చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాతనే యతీంద్రను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. సిద్దరామయ్య మరోసారి పోటీ చేసే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల వేళ వరుణ నియోజకవర్గంలో ఇవే చివరి ఎన్నికలని ప్రకటించారు. నామినేషన్‌ సమయంలోనూ ధవన్‌ రాజకీయాల్లోకి వస్తారని ప్రస్తావించిన విషయం కూడా ఉంది. మారుతున్న రాజకీయాలలో రిటైర్డు అయ్యేది లేదని ఇటీవలే ప్రకటించారు.


pandu3,2.jpg

ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణ నుంచి మనవడు ధవన్‌ను పోటీ చేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వరుణలో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణలో రాకేశ్‌ను కాంగ్రెస్‌ నాయకులు స్మరించారు. ఇదే సందర్భంలోనే పలువురు నాయకులు ధవన్‌ను రాజకీయాలలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఇలా ధవన్‌ రాజకీయ ప్రవేశానికి అడుగులు పడుతునట్లు తెలుస్తోంది. అదే జరిగితే మరో కుటుంబం నుంచి వారసుడు రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ తగ్గిన బంగారం ధరలు..కానీ వెండి మాత్రం

మొదటి పావుగంటలో రిజర్వేషన్లకు ఆధార్‌

ప్రైవేటు కాలేజీల ఆందోళనలకు సంపూర్ణ మద్దతు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 16 , 2025 | 11:37 AM