Home » Asia Cup
పాక్‌తో మ్యాచ్‌లో పొలిటికల్ కామెంట్స్ చేసినందుకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ఐసీసీ జరిమానా విధించింది. భవిష్యత్తులో ఇలాంటి కామెంట్స్ చేయొద్దని చెప్పింది. మ్యాచ్ ఫీజులో 30 శాతాన్ని ఫైన్‌గా విధించింది.
ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ సమయం రానే వచ్చేసింది. ఈసారి ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో మొదటిసారిగా ఈ రెండు జట్లు ఫైనల్ చేరుకోవడం విశేషం. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఆసియా కప్ సూపర్ ఫోర్ స్టేజ్‌లో భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరోసారి సత్తా చాటాడు. కీలక మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డ్ సృష్టించాడు.
ప్రస్తుత ఆసియా కప్‌లో ఇప్పటివరకు భారత్, పాకిస్థాన్ జట్లు రెండు సార్లు తలపడ్డాయి. రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌ల్లో ఆట కంటే మైదానంలో జరిగిన డ్రామానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తొలి మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ వివాదం ఉద్రిక్తతలు సృష్టించింది.
ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే నేడు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ సమరంలో భారత్ ఓడితే పరిస్థితి ఏంటి, విన్ ప్రిడక్షన్ ఎలా ఉందనే వివరాలను ఇక్కడ చూద్దాం.
ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ డూ ఆర్ డై కీలక మ్యాచులో విజయం సాధించింది. అబుదాబీలో నిన్న రాత్రి అబుధాబిలో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ గెలిచింది. దీంతో ఫైనల్ చేరే అవకాశం ఉందా, నెక్ట్స్ ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
హాఫ్ సెంచరీ చేసి పాకిస్థాన్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించిన ఫర్హాన్ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. ఆ లక్ష్యాన్ని భారత బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. ఈ నేపథ్యంలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌పై పాకిస్థాన్ జట్టు మాజీ బౌలర్ డానిష్ కనేరియా ప్రశంసలు కురిపించాడు.
పాకిస్థాన్ టెర్రరిస్టులు పహల్గామ్‌లో దాడి చేసి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో ఫర్హాన్ అలా తుపాకీ పేలుస్తున్నట్టు చేసిన సెలెబ్రేషన్‌పై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన పలువురు మాజీ ఆటగాళ్లు కూడా ఈ సంబరాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్ విజయాన్ని పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు అంకితం ఇస్తున్నట్లు సూర్యకుమార్ యాదవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనను సౌరభ్ భరద్వాజ్ తప్పుపట్టారు.
ఆసియా కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు వ్యవహరించిన తీరును పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. పాక్ ఆటగాళ్లతో టీమిండియా కెప్టెన్, ఆటగాళ్లు కరచాలనం చేయలేదు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్‌తో సహా, ఆ దేశ మాజీ ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.