Asia Cup Ind Vs Pak: పాక్‌ను లైట్ తీసుకోవద్దు.. భారత్‌కు మాజీ క్రికెటర్ హెచ్చరిక
ABN , Publish Date - Sep 28 , 2025 | 03:26 PM
పాక్‌ను లైట్ తీసుకోవద్దని భారత్‌ను ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ హెచ్చరించారు. ఫైనల్స్‌లో పాక్ తన సర్వశక్తులు ఒడ్డి పోరాడే అవకాశాలు మెండుగా ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు. అలసత్వాన్ని భారత్ దరిచేరనివ్వొద్దని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్, పాక్ మధ్య కాసేపట్లో ఆసియా కప్ తుది పోరు జరగనుంది. భారత్ హాట్ ఫేవరెట్‌గా ఉన్నా పాక్‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఈ నేపథ్యంలో మాజీ ఇంగ్లండ్ స్పిన్నర్ మాంటీ పనేసర్ టీమిండియాకు కీలక హెచ్చరిక చేశాడు. పాక్‌ను అస్సలు లైట్ తీసుకోవద్దని మరీ మరీ చెప్పాడు. ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌ల్లో భారత్ పైచేయి సాధించినా ఫైనల్‌లో పాక్ పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకునే ఛాన్స్ లేకపోలేదని వార్నింగ్ ఇచ్చారు (Monty Panesar warning India).
‘పాక్ చాలా ప్రమాదకరమైన టీమ్. వాళ్లకు కోల్పోయేదేమీ లేదు. ఇప్పటి వరకూ భారత్ టాప్‌లో ఉన్నా చివరి మ్యాచ్‌లో వాళ్లు సర్వ శక్తులు ఒడ్డి పోరాడే ఛాన్స్ ఉంది. భారత్ ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. ఒకప్పుడు పాక్ గొప్ప టీమ్. ప్రస్తుతం కొంత బలహీనపడి ఉండొచ్చు. కానీ తనదైన రోజు భారత్‌ను ఓడించే అవకాశం ఉంది. కాబట్టి, ఏం కాదులే అన్న దిలాసా భారత్‌కు ఉండకూడదు. అప్రమత్తంగా ఉండాలి’ అని హెచ్చరించారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ ఫలితం పునరావృతం అయ్యే అవకాశం ఉందని హెచ్చరించాడు.
టీమిండియా: సూర్యకుమార్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, జితేశ్ శర్మ, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, సంజూ శాంసన్, హర్షిత్ రాణా, రింకూ సింగ్
పాక్ టీం: సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రాఫ్, ఫకార్ జమాన్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సెయిన్ తలాత్, ఖుష్ది్ల్ షా, మొహమ్మద్ హ్యారిస్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ వసీమ్, సాహిబ్‌జాదా ఫర్హాన్, సయిమ్ అయూబ్, సల్మాన్ మిర్జా, షాహీన్ అఫ్రీదీ, సూఫియాన్ మొకీమ్.
ఇవి కూడా చదవండి
ఫైనల్‌లో టీమిండియా గెలిస్తే ఎవరికీ అందని రికార్డు.. చరిత్రలో మొదటి జట్టుగా..
ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి