Asia Cup SKY Fined: పొలిటికల్ కామెంట్స్.. సూర్యకుమార్ యాదవ్, పాక్ బౌలర్ రవూఫ్‌పై ఐసీసీ జరిమానా
ABN , Publish Date - Sep 27 , 2025 | 07:11 AM
పాక్‌తో మ్యాచ్‌లో పొలిటికల్ కామెంట్స్ చేసినందుకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ఐసీసీ జరిమానా విధించింది. భవిష్యత్తులో ఇలాంటి కామెంట్స్ చేయొద్దని చెప్పింది. మ్యాచ్ ఫీజులో 30 శాతాన్ని ఫైన్‌గా విధించింది.
ఇంటర్నెట్ డెస్క్: పాక్‌తో మ్యాచ్ అనంతరం పొలిటికల్ కామెంట్స్ చేసిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ఐసీసీ జరిమానా విధించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అతడి మ్యాచ్ ఫీజలో 30 శాతం ఫైన్ కింద చెల్లించాలని ఐసీసీ పేర్కొంది. ఆసియా కప్‌లో భాగంగా పాక్‌తో తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం మీడియాతో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ మాట్లాడుతూ ఈ విజయాన్ని భారత సాయుధ దళాలకు అంకితమిస్తున్నామని అన్నారు. పహల్గాం దాడుల బాధితులకు కూడా సంఘీభావం తెలిపారు (Suryakumar Yadav fined).
ఈ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఇటీవల ఐసీసీ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ ఆధ్వర్యంలో ఈ విషయమై విచారణ కూడా జరిగింది. అయితే, తానేమీ తప్పు చేయలేదని సూర్యకుమార్ యాదవ్ ఈ సందర్భంగా స్పష్టం చేయలేదు. కానీ తదుపరి మ్యాచ్‌ల్లో ఎలాంటి రాజకీయ కామెంట్స్ చేయొద్దని ఐసీసీ అతడికి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయమైన పత్రికా ప్రకటన కూడా విడుదల చేస్తామని ఐసీసీ వర్గాలు మీడియాకు తెలిపాయి. అయితే, ఫైనల్స్ తరువాతే ఈ ప్రకటన ఉంటుందని కూడా పేర్కొన్నాయి (ICC disciplinary action). అయితే, ఈ నిర్ణయంపై బీసీసీఐ అప్పీల్ చేసింది.
ఇదిలా ఉంటే.. పాక్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్‌పై కూడా ఐసీసీ జరిమానా విధించింది. ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో దురుసుతగా ప్రవర్తించినందుకు అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. మరో పాక్ క్రికెటర్ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ను మాత్రం వార్నింగ్ ఇచ్చి విడిచిపెట్టింది. అతడిపై ఎలాంటి ఫైన్ విధించలేదు. గన్ షాట్ ఇస్తున్నట్టు సైగలు చేసిన ఫలితంగా ఈ ఫైన్ విధించింది. అయితే, తామేమీ తప్పు చేయలేదని రవూఫ్, ఫర్హాన్ కూడా విచారణ సందర్భంగా పేర్కొన్నారు (Pahalgam comment Asia Cup).
ప్రభుత్వం భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాక్‌తో తొలి మ్యాచ్‌లో టీమిండియా క్రీడాకారులు పాక్ జట్టు సభ్యులకు కరచాలనం చేయకుండా సైలెంట్ బాయ్‌కాట్ చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్
విండీస్‌తో టెస్ట్ సిరీస్.. జట్టును ప్రకటించిన సెలక్షన్ కమిటీ..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి