Asia Cup 2025 Final: భారత్, పాకిస్తాన్ మధ్య ఫైనల్ పోరు.. ఎప్పుడు, ఎక్కడ జరగుతుందంటే..
ABN , Publish Date - Sep 26 , 2025 | 08:19 AM
ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ సమయం రానే వచ్చేసింది. ఈసారి ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో మొదటిసారిగా ఈ రెండు జట్లు ఫైనల్ చేరుకోవడం విశేషం. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఆసియా కప్ 2025 (Asia Cup 2025 Final) ఫైనల్ మ్యాచ్ రణరంగం సిద్ధమైంది. శతాబ్దాల శత్రుత్వం, ఉద్విగ్న ఆటతీరు, ఉత్కంఠభరిత క్షణాలతో కూడిన ఈ పోరులో భారత్, పాకిస్తాన్ జట్లు (India vs Pakistan) మునుపెన్నడూ లేనంత ఉత్సాహంతో తలపడనున్నాయి. ఈ రెండు జట్లు కూడా ఇప్పుడు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. ఈ టోర్నమెంట్‌లో మొదటిసారిగా ఈ రెండు దిగ్గజ జట్లు ఫైనల్లో ఆడటం క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. ఈ పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నారు.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం
ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ సెప్టెంబర్ 28, 2025న (ఆదివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం (Dubai International Cricket Stadium)లో రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో ఉన్న ఈ స్టేడియం 25,000 సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంది. అవసరమైతే 30,000 వరకు విస్తరించవచ్చు. 2009లో ప్రారంభమైన ఈ మైదానం రింగ్ ఆఫ్ ఫైర్ లైటింగ్, గుండ్రని పైకప్పుతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గతంలో టీ20 వరల్డ్ కప్, ఐపీఎల్, ఆసియా కప్, PSL వంటి ప్రముఖ టోర్నమెంట్‌లు జరిగాయి.
హెడ్ టూ హెడ్
ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్ ఇప్పటికే రెండుసార్లు తలపడ్డాయి. సెప్టెంబర్ 14న గ్రూప్ స్టేజ్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ సెట్ చేసిన 128 పరుగుల లక్ష్యాన్ని భారత్ 7 వికెట్ల తేడాతో, 25 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. సెప్టెంబర్ 21న సూపర్ ఫోర్ దశలో పాకిస్తాన్ 171/5 స్కోరు చేసినా, భారత్ 18.5 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74), శుభ్‌మన్ గిల్ (28 బంతుల్లో 47) అద్భుతమైన ఆటతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
భారత జట్టులో కెప్టెన్: సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్: శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్లు: సంజు శాంసన్, జితేష్ శర్మ, ఆటగాళ్లు: అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు.
పాకిస్తాన్ జట్టులో కెప్టెన్: సల్మాన్ అలీ ఆఘా, వికెట్ కీపర్లు: మొహమ్మద్ హారిస్, సాహిబ్‌జాదా ఫర్హాన్, ఆటగాళ్లు: అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షా, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ వసీమ్ జూనియర్, సయీం అయూబ్, సల్మాన్ మిర్జా, షాహీన్ ఆఫ్రిదీ, సుఫ్యాన్ మొకీమ్ కలరు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి