Home » AP News
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోగా, క్యూలైన్ దాదాపు మూడు కిలోమీటర్ల మేరకు విస్తరించింది.
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం గొరపూడిలో భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు.
తిరుమల శ్రీవారి ప్రసాదాల ముడిసరుకుల వినియోగంలో కూటమి ప్రభుత్వం కచ్చితంగా వ్యవహరిస్తోంది. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు టెండరు నిబంధనల్లో పేర్కొన్న నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే సరుకులను వెనక్కి పంపిస్తున్నారు.
పాకిస్థాన్‌లోని గ్రూపులకు నౌకాదళ సమాచారాన్ని పంపించినట్లు నిర్దిష్ట సమాచారం అందడంతో విజయవాడలో ఉంటున్న భారత నేవీ ఉద్యోగిని కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
తెలంగాణకు చెందిన లారీ డ్రైవర్ సమీర్ పత్రాలను దుర్వినియోగం చేసి అతని పేరుతో నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. ఐదు నెలల్లో రూ.36 కోట్ల లావాదేవీలు నమోదైన వ్యవహారంలో చిత్తూరుకు చెందిన రెహ్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 61 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ జారీ చేసి గెజిట్ ప్రచురించింది.
విజయవాడ ధర్నాచౌక్‌లో అనుమతి లేకుండా ధర్నా చేసిన స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.
ఓ చిన్నపాటి ఇల్లు నిర్మించాలన్నా.. కనీసం కొన్ని నెలల సమయం పడుతుంది. సంప్రదాయ పద్ధతిలో కంటే తక్కువ ఖర్చుతో, కేవలం 5 రోజుల్లోనే ఇల్లు నిర్మించే...
పేదల సొంతింటి కలను నిజం చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేస్తోంది. వెయ్యికాదు.. లక్ష కాదు..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలను మరింత సులభతరం చేసే దిశగా సరికొత్త ఆలోచనలకు రూపకల్పన జరిగింది.