Share News

Vijayawada ACB Court: సత్యవర్థన్‌ కేసులో ఇద్దరికి రిమాండ్‌

ABN , Publish Date - Dec 02 , 2025 | 05:55 AM

ముదునూరి సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో ఇద్దరు నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది.

Vijayawada ACB Court: సత్యవర్థన్‌ కేసులో ఇద్దరికి రిమాండ్‌

విజయవాడ, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ముదునూరి సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో ఇద్దరు నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. ఈ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ అనుచరులు కొమ్మా కోటేశ్వరరావు(ఏ2), తేలప్రోలు రాము(ఏ3), వజ్రకుమార్‌(ఏ6), ఎర్రంశెట్టి రామాంజనేయులు(ఏ9), చేబ్రోలు శ్రీనివాసరావు(ఏ11), వేణు(ఏ12) నిందితులుగా ఉన్నారు. వాళ్లంతా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ ఆరుగురు పరారీలో ఉన్నారని, నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ (ఎన్‌బీడబ్ల్యూ) జారీ చేయాలని అప్పట్లో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనితో కోర్టు వారెంట్లు జారీ చేసింది. నిందితుల్లో తేలప్రోలు రాము, వజ్రకుమార్‌ ఆ వారెంట్‌ను రీకాల్‌ చేయించుకోవడానికి సోమవారం కోర్టుకు హాజరయ్యారు. న్యాయాధికారి పి.భాస్కరరావు వారికి ఈనెల 15వ తేదీ వరకు రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు.

Updated Date - Dec 02 , 2025 | 05:59 AM