Home » AP Govt
విజయవాడలో డీఎస్సీ స్పోర్ట్ కోటా ఉపాధ్యాయులపై జరిగిన దాడి ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. దాడి చేసిన వారిని గుర్తించి ఎవరినీ వదిలి పెట్టవద్దని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించింది.
విజయవాడలో డీఎస్సీ స్పోర్ట్ కోటా ఉపాధ్యాయులపై వైసీపీ నేతలు దాడి చేయడంపై మంత్రి లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువులపై దాడి చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు.
శుభ్రమైన వీధి చీపురుతో మొదలవ్వదని.. అది ఒక బాధ్యతాయుతమైన పౌరుడితో మొదలవుతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రపంచ పారిశుధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్(X) వేదికగా డిప్యూటీ సీఎం పవన్ పోస్టు పెట్టారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు తనపై చేసేవి చెత్త ఆరోపణలని ధ్వజమెత్తారు.
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు ఆదివారం విజయవాడలో రౌండ్ టెబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు అభ్యర్థులు మాట్లాడారు. ఉద్యోగాలు సంపాదించేందుకు తాము పడిన కష్టాల గురించి పలువురు ఉపాధ్యాయులు తెలిపారు.
అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న(శనివారం) విశాఖపట్నంలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా ఆర్కే బీచ్‌లో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
ఏపీలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల లభ్యత, పంటల సాగుపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
చేనేత పెన్షన్ల వెరిఫికేషన్ అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి ‘నేతన్నల పడిగాపులు’ పేరుతో ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకువచ్చింది. ఆంధ్రజ్యోతి కథనాలపై ఏపీ మంత్రి సవిత స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 21, 22వ తేదీల్లో రెండు రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 21వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు సీఎం హాజరుకానున్నారు.