Home » AP BJP
రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేస్తాయనే భయాందోళనలతో మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. తెలంగాణలో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తే కేటీఆర్‌కి ఏంటి బాధ అని ప్రశ్నించారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డికి మద్దతుగా ఉన్నారని రెడ్లను, ఏపీలో చంద్రబాబుకు మద్దతుగా ఉన్నారని కమ్మ కులస్తులను కేటీఆర్ విమర్శించిన మాట నిజం కాదా అని ఎంపీ రమేష్ ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా మంత్రులు అభినందనలు తెలిపారు. మంత్రి నారా లోకేష్‌ను ఆలింగనం చేసుకుని పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు చెప్పారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలని.. లేకపోతే తాము తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు.
బీజేపీ ఆంధ్రప్రదేశ్ మీడియా ఇన్‌చార్జ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణానికి అరుదైన గౌరవం దక్కింది.. ప్రతిష్టాత్మక తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) అందించే విశిష్ట పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ నేతలపై తమిళనాడులో కేసు పెట్టడం మురుగన్‌పై దాడిగా భావిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. అన్నామలైకి అండగా పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగారని పీవీఎన్ మాధవ్ చెప్పుకొచ్చారు.
బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను మాజీ ఎమ్మెల్సీ పోకల వంశీ నాగేంద్ర మాధవ్ స్వీకరించారు. ఈ పదవికి మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను మాధవ్‌కు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అప్పగించారు.
బీజేపీలో కుటుంబ రాజకీయాలు ఉండవని ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. మాధవ్ వ్యక్తిగతంగా నిజమైన రాజకీయ నాయకుడిగా ఎదిగారని అన్నారు. ఆయన ఆలోచనల్లో ఒక బాణి, ఒక వాణి ఉంటుందని ప్రశంసించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేసేలా పీవీఎన్ మాధవ్ చూడాలని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కోరారు. కింది స్థాయి కార్యకర్తలతో మాట్లాడి..వారి సమస్యలు పరిష్కరించేలా మాధవ్ పని చేయాలని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఈనెల 23 నుంచి నెల రోజులపాటు ఇంటింటికీ తొలి అడుగు విజయయాత్ర నిర్వహించబోతుంది. అటు, శుక్రవారం నాడు టీడీపీ శ్రేణులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో పార్టీ అధినేత చంద్రబాబు పలు కీలక ఆదేశాలిచ్చారు.
దేశంలో అవినీతి రహిత పాలన ఉండాలని ప్రజలు భావించి తమను గెలిపిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశాన్ని పాలించగల సత్తా ఉందని ప్రజలు భావించి బీజేపీకి విజయాన్ని అందించారని చెప్పారు.