Home » AP Assembly Sessions
కర్ణాటక నుంచి గ్రూప్ ఆఫ్ టీమ్ ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేశారని ఎమ్మెల్యే వర్ల కుమార్ చెప్పారు. వర్గీకరణ దేశ వ్యాప్తంగా మొదటి సారి ఆంధ్ర ప్రదేశ్‌లో అమలు పరిచిన ఘనత చంద్రబాబు ది అని ఎమ్మెల్యే కొనియాడారు.
మన సంస్కృతి సంప్రదాయాలు గురించి మంచి సందేశం వెళ్లాలనే డ్రెస్ కోడ్ పాటిస్తున్నామని మంత్రి అనిత చెప్పారు. అందరు గాయత్రీ దేవి అలంకారానికి అనుగుణంగా రెడీ శారీస్‌తో వచ్చినట్లు తెలిపారు.
ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండా బిల్లులను వైసీపీ ఆపివేసిందని మంత్రి పార్థసారథి అన్నారు. రూ.900 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని తెలిపారు. ఆవ భూముల కుంభకోణంపై విజిలెన్స్ విచారణ ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
రాష్ట్రంలో వంతెనలు, రోడ్లపై ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్న అంశం వాస్తవమే అని మంత్రి బీసీ జనార్ధన్ చెప్పుకొచ్చారు. గతంలో టీడీపీ హయాంలో వేసిన రోడ్లు.. తప్ప కొత్తగా వైసీపీ హయాంలో ఆర్ అండ్ బీ రోడ్లు అభివృద్ధి చేయలేదని విమర్శించారు.
మార్కాపురంలో ఆసుపత్రి, వైద్య కళాశాల నిర్మాణం కోసం వైసీపీ హయాంలో రూ. 47 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. వైద్య కళాశాలను పీపీపీ విధానంలో నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తు చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం రూ. 4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టిందని మంత్రి లోకేశ్ ఆరోపించారు. ఇప్పుడు బకాయిలపై వాయిదా తీర్మానం అడగటం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నేడు తిరిగి జోష్‌తో మొదలుకానుంది. ప్రశ్నోత్తరాల పరంపరతో ప్రారంభమయ్యే ఈ సమావేశాలు కీలక అంశాలపై చర్చించనున్నాయి. దీంతోపాటు పలు బిల్లులు కూడా ప్రవేశపెట్టనున్నారు.
జీఎస్టీ సంస్కరణలతో మేడిన్ ఇండియా మరింత బలోపేతం అవుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బలమైన, సమతుల్యమైన సమాజ నిర్మాణమే లక్ష్యమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు రైతులను పట్టించుకోలేదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రబీపంటకు పైసా కూడా బీమా ఇవ్వలేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈరోజు వ్యవసాయ రంగంతో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. అసెంబ్లీలో జరిగే ముఖ్యమైన చర్చ, అంశాలను ABN లైవ్ అప్డేట్స్తో మీ ముందుకు..