Share News

Minister Satyakumar Yadav: గత వైసీపీ ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేసింది..

ABN , Publish Date - Sep 23 , 2025 | 12:22 PM

మార్కాపురంలో ఆసుపత్రి, వైద్య కళాశాల నిర్మాణం కోసం వైసీపీ హయాంలో రూ. 47 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. వైద్య కళాశాలను పీపీపీ విధానంలో నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తు చేశారు.

Minister Satyakumar Yadav: గత వైసీపీ ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేసింది..
Minister Satyakumar Yadav

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలపై ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ సమాధానం ఇచ్చారు. మార్కాపురం పట్టణంలో 640 పడకల ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. గిద్దలూరు, కనిగిరి, కోవూరు నియోజకవర్గ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది నియామకం చేస్తామని పేర్కొన్నారు.


మార్కాపురంలో ఆసుపత్రి, వైద్య కళాశాల నిర్మాణం కోసం గత వైసీపీ హయాంలో రూ. 47 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. వైద్య కళాశాలను పీపీపీ విధానంలో నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. కనిగిరి ఆసుపత్రిని ఆదునీకంగా తీర్చిదిద్దిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి అభినందనలు తెలిపారు. జీఎస్టీ నూత‌న సంస్కర‌ణ‌లతో ప్రజ‌ల ఆరోగ్య సంర‌క్షణ‌కు మ‌రింత భ‌రోసా పెరిగింద‌న్నారు.


రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి అమలు చేయబోతున్న ఉచిత యూనివర్సల్ హెల్త్ పాలసీ వల్ల కూటమి ప్రభుత్వానికి ఏడాదికి సగటున రూ.750 కోట్ల వరకు ఆదా అవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ప‌న్నుల‌ శ్లాబులను తగ్గించాలనే నిర్ణయం సరైనదని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వ‌ల్ల సామాన్య, మ‌ధ్యత‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు ఎంతో ఊర‌ట క‌లిగిస్తుందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ

ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు

Updated Date - Sep 23 , 2025 | 12:22 PM