-
-
Home » Mukhyaamshalu » get ap assembly session latest updates on abn vreddy
-
AP Assembly Live: అడ్డంగా ఇరుక్కున్న వైసీపీ..
ABN , First Publish Date - Sep 23 , 2025 | 10:23 AM
ఏపీ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజులు కొనసాగుతున్నాయి. ఈరోజు జరిగే సమావేశాలలో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.
Live News & Update
-
Sep 23, 2025 16:55 IST
అడ్డంగా ఇరుక్కున్న వైసీపీ..
అమరావతి: విశాఖ ఉక్కు అంశంపై వైసీపీ ఇరుకున పడింది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడినందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కుమారస్వామికి, కేంద్రానికి అభినందనలు తెలిపిన మంత్రి లోకేష్.
ప్రధాని మోదీ, ఆర్దికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ , మంత్రి హెచ్‌డి కుమార స్వామిని అభినందిస్తూ తీర్మానం.
అభినందన తీర్మానాన్ని అంగీకరిస్తున్నారా లేదా అంటూ ప్రతిపక్ష వైసీపీని నిలదీసిన కూటమి ఎమ్మెల్సీలు.
లోకేష్ తీర్మానానికి అంగీకారం తెలిపిన వైసీపీ.
తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు ప్రకటించిన శాసన మండలి చైర్మైన్.
-
Sep 23, 2025 15:25 IST
ఏపీ శాసనమండలిలో అధికార, విపక్ష సభ్యుల వాగ్వాదం
వరుదు కళ్యాణిని ఉద్దేశించి లోకేష్ వ్యాఖ్యలు సరికాదన్న బొత్స
ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని బొత్స డిమాండ్
తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్న మంత్రి లోకేష్
తాను మాట్లాడినప్పుడు బొత్స సభలో లేరన్న మంత్రి లోకేష్
మహిళల గురించి మీరు కూడా మాట్లాడతారా అంటూ లోకేష్ ఆగ్రహం
మహిళలను తిడితే ఆనందపడే వ్యక్తులం మేం కాదు: మంత్రి లోకేష్
-
Sep 23, 2025 12:24 IST
articleText
-
Sep 23, 2025 12:23 IST
గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది
ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండా బిల్లులు నిలివేశారు: మంత్రి పార్థసారథి
రూ.900కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో పెట్టారు: మంత్రి పార్థసారథి
ఆవ భూముల స్కామ్‌పై విజిలెన్స్ విచారణ ప్రకారం చర్యలు: పార్థసారథి
జగనన్న కాలనీల భూముల సేకరణలో అక్రమాలు జరిగాయి: పార్థసారథి
-
Sep 23, 2025 12:23 IST
ప్రధానమంత్రి ఆవస్ యోజనలో ఇళ్ల నిర్మాణంపై ఏపీ అసెంబ్లీలో చర్చ
సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లు నిర్మించాలన్న ఎమ్మెల్యే బత్తుల
ఆవ భూముల స్కామ్‌పై విజిలెన్స్ విచరాణ ఏమైందో చెప్పాలని డిమాండ్
చాలాచోట్ల సెంటు భూమి కోసం కేటాయించిన స్థలాలు..
ఖాళీగా ఉన్నాయన్న పత్తిపాడు ఎమ్మెల్యూ బూర్ల రామాంజనేయులు
-
Sep 23, 2025 11:40 IST
ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం: మంత్రి సత్యకుమార్
మార్కాపురం ఆస్పత్రి వైద్య కళాశాల నిర్మాణానికి..
వైసీపీ రూ.47 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది: మంత్రి సత్యకుమార్
వైద్య కళాశాలను పీపీపీ విధానంలో నిర్మిస్తాం: మంత్రి సత్యకుమార్
640 పడకల ఆస్పత్రి నిర్మాణం చేస్తున్నాం: మంత్రి సత్యకుమార్
గిద్దలూరు, కనిగిరి, కోవూరు ఆస్పత్రుల్లో సిబ్బందిని నియమిస్తాం: సత్యకుమార్
-
Sep 23, 2025 11:38 IST
ఏపీ శాసనమండలి నుంచి వైసీపీ వాకౌట్
-
Sep 23, 2025 11:38 IST
ఏపీ అసెంబ్లీ: వైసీపీ హయాంలో R&B రోడ్లను నిర్లక్ష్యం చేశారు: బీసీ జనార్దన్‌రెడ్డి
గత ఐదేళ్లు వంతెనలు, రోడ్ల మరమ్మతులు చేయకపోవడంతో ఇబ్బందులు
వర్షాకాలం తర్వాత రోడ్ల మరమ్మతులు చేస్తాం: మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
ఏపీలో 352 వంతెనలు శిథిలావస్థకు చేరాయి: బీసీ జనార్దన్‌రెడ్డి
త్వరలో రోడ్ల అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం: బీసీ జనార్దన్‌రెడ్డి
-
Sep 23, 2025 11:38 IST
ఏపీ అసెంబ్లీలో గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలపై ప్రశ్నోత్తరాలు
మార్కాపురం మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో నిర్మించాలని నిర్ణయం: సత్యకుమార్
గిద్దలూరు, కనిగిరి, కోవూరు ఆస్పత్రుల్లో సిబ్బందిని నియమిస్తాం: మంత్రి సత్యకుమార్
-
Sep 23, 2025 11:37 IST
ఏపీ మండలి: పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలకు..
తల్లికి వందనం వర్తించట్లేదని మంత్రి లోకేష్‌ను అడిగిన చైర్మన్
అందరికీ వర్తించేలా జీవో ఉందా అని అడిగిన చైర్మన్
పారిశుద్ధ్య కార్మికులకు తల్లికి వందనం వర్తించేలా జీవో ఉందన్న లోకేష్
జీవోలోని పలు అంశాలను చైర్మన్‌కు చదివి వినిపించిన లోకేష్
అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు పథకం వర్తింపజేయాలనే వినతి..
ప్రభుత్వ పరిశీలనలో ఉంది.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం: లోకేష్
-
Sep 23, 2025 10:53 IST
వైసీపీ సభ్యులకు మంత్రి లోకేష్ కౌంటర్
రాష్ట్రంలో అమ్మఒడి కాదు.. తల్లికి వందనం వస్తోంది: లోకేష్
వైసీపీ హయాంలో అమ్మఒడిని కొందరికే పరిమితం చేశారు
ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నాం: లోకేష్
-
Sep 23, 2025 10:26 IST
వాయిదా తీర్మానం తిరస్కరించాక చర్చ ఉండదు: మండలి చైర్మన్
రేపు వాయిదా తీర్మానం ఇస్తే చర్చిద్దాం: మండలి చైర్మన్
-
Sep 23, 2025 10:25 IST
మేం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టమానడం అవాస్తవం: బొత్స
సభను తప్పుదోవ పట్టించేందుకే మాపై విమర్శలు: బొత్స
-
Sep 23, 2025 10:25 IST
బీఏసీలో ఒకటి చెప్పి.. ఇక్కడ మరో అంశం లేవనెత్తున్నారు: పయ్యావుల
-
Sep 23, 2025 10:25 IST
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీఏసీలో ఎందుకు మాట్లాడలేదు?: లోకేష్
-
Sep 23, 2025 10:24 IST
వాయిదా తీర్మానం తిరస్కరించినా చర్చకు పట్టుబట్టిన వైసీపీ
సమాధానం ఇచ్చేందుకు సిద్ధమని మంత్రి లోకేష్ సవాల్
-
Sep 23, 2025 10:23 IST
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం
వైసీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన మండలి చైర్మన్
-
Sep 23, 2025 10:23 IST
శాసనమండలిలోనూ వైసీపీకి సౌండ్ లేదు: మంత్రి లోకేష్
GSTకి అనుకూలమా? వ్యతిరేకమా? అని అడిగిన ప్రశ్నకు..
వైసీపీ సభ్యులంతా మౌనంగా ఉన్నారు: మంత్రి లోకేష్
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చకు మేం సిద్ధం: లోకేష్
రూ.4వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్స్ బకాయిలు పెట్టిన వైసీపీ..
ఇప్పడు అదే అంశంపై వాయిదా తీర్మానం ఇవ్వడం విడ్డూరం: లోకేష్