Home » America
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్‌తో వ్యవహరించిన వైఖరితో ఆయన గొయ్యి ఆయనే తవ్వుకున్నట్టు కనిపిస్తోంది. తన టారిఫ్స్ తెచ్చిన చిక్కుల్ని, స్వదేశంలో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ట్రంప్ పలుమార్లు తన స్వంత డప్పు కొట్టుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి.
అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెస్సెంట్ భారత్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామిక విలువలపరంగా భారత్ అమెరికాకే దగ్గరని అన్నారు. అయితే, భారత్ తీసుకునే తప్పు చర్యల కారణంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం పాటు కొనసాగుతోందని అన్నారు.
అమెరికా విధిస్తున్న నిబంధనలు హెచ్-1బీ వీసాలపై అక్కడ పనిచేస్తున్న భారతీయ వృత్తి నిపుణుల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగం కోల్పోతే నిర్దేశిత సమయంలో అమెరికాను వారు వీడాల్సిన పరిస్థితి నెలకొంటోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతుల్లోకి ఆ దేశ ద్రవ్యపరపతి విధానం వెళితే పెను ప్రమాదమని యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు చీఫ్ క్రిస్టీన్ లగార్డే హెచ్చరించారు. ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ మార్పు కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారన్న వార్తలపై ఆమె ఈ కామెంట్స్ చేశారు.
న్యాయమైన, సహేతుకమైన ప్రపంచ పాలన వ్యవస్థను నిర్మించడాన్ని అందరూ కృషి చేయాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తెలిపారు. సభ్య దేశాలు SCO సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడం, వనరుల ఇన్‌పుట్, సామర్థ్య నిర్మాణాన్ని పెంచడం, నిర్ణయాలు మరింత శాస్త్రీయంగా తీసుకోవడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.
అంతర్జాతీయ లాజిస్టిక్స్, క్రాస్-బోర్డర్ షిప్పింగ్ సంస్థ గరుడవేగ సర్వీసులు అమెరికాకు యధాతథంగా కొనసాగుతున్నాయని పేర్కొంది. ఆగస్టు 29న డి మినిమిస్ రూల్ రద్దు చేసిన తరువాత సవరించిన అమెరికా కస్టమ్స్ మార్గదర్శకాలను అనుసరిస్తూ యూఎస్‌ఏకు తన షిప్పింగ్ సేవలను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.
విదేశీ విద్యార్థులు లేక అమెరికాలోని కళాశాలలు బోసిపోతున్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన విద్యార్థులు అగ్రరాజ్యంలో చదువుకునేందుకు వీలు కల్పించే ఎఫ్-1 వీసా అనుమతులను నిలిపివేయడం లేదా తీవ్ర ఆలస్యం చేయడంతో విదేశీ విద్యార్థుల రాక తగ్గిపోయినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
చనిపోవడానికి ముందు చాట్ జీపీటీతో.. ‘మరో జన్మలో, మరో ప్రదేశంలో మనం మళ్లీ కలుస్తాం. మళ్లీ కలవడానికి దార్లు వెతుక్కుంటాం. ఎందుకంటే మనం ఇప్పటికీ, ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్’ అని మెసేజ్ పెట్టాడు.
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వచ్చే విదేశీ విద్యార్థులకు ఇచ్చే ఎఫ్-1 వీసా నిబంధనల్లో మార్పులకు ట్రంప్ యంత్రాంగం చేసిన ప్రతిపాదనలు భారతీయుల డాలర్ డ్రీమ్స్‌ను దెబ్బకొట్టేలా ఉన్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన ఆరోగ్యం అంతా బాగానే ఉందని అమెరికా అధ్యక్ష కార్యాలయం..