Share News

Epstein files release: ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం.. ఫైల్స్ విడుదల బిల్లుపై ట్రంప్ సంతకం..

ABN , Publish Date - Nov 20 , 2025 | 11:26 AM

ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను విడుదల చేసే బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్ ద్వారా వెల్లడించిన ట్రంప్.. ఈ సందర్భంగా డెమొక్రాట్లపై పలు ఆరోపణలు చేశారు. జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం గతంలో అగ్రరాజ్యం అమెరికాను కుదిపేసిన సంగతి తెలిసిందే.

Epstein files release: ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం.. ఫైల్స్ విడుదల బిల్లుపై ట్రంప్ సంతకం..
Epstein files release

జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం గతంలో అగ్రరాజ్యం అమెరికాను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కీలక ఫైల్స్‌ విడుదలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను విడుదల చేసే బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్ ద్వారా వెల్లడించిన ట్రంప్.. ఈ సందర్భంగా డెమొక్రాట్లపై పలు ఆరోపణలు చేశారు (Epstein scandal revelations).


'లైంగిక నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో డెమొక్రాట్లకు ఉన్న అనుబంధాల గురించి త్వరలోనే బయటపడవచ్చు. ఎందుకంటే నేను ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్ విడుదల బిల్లుపై సంతకం చేశాను' అని ట్రంప్ పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి బాలికలు, యువతలకు జెఫ్రీ ఎప్‌స్టీన్ డబ్బు ఆశ చూపించి ఇళ్లకు రప్పించి పలు అఘాయిత్యాలకు పాల్పడేవాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు నిజమని తేలడంతో ఎప్‌స్టీన్‌ను అరెస్ట్ చేశారు. జైల్లో ఉన్న సమయంలోనే 2019లో అనుమానాస్పద స్థితిలో ఎప్‌స్టీన్‌ మరణించాడు. ఈ సెక్స్ కుంభకోణంలో ఎప్‌స్టీన్‌తో పాటు అమెరికాకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి (Trump signs bill).

trump.jpg


ముఖ్యంగా ఎప్‌స్టీన్‌కు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడని, ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరు కూడా ఉందని గతంలో వార్తలు వచ్చాయి (Epstein documents public). ఎప్‌‌స్టీన్ ఫైల్స్‌ను బహిర్గతం చేయడాన్ని ట్రంప్ ఇప్పటివరకు వ్యతిరేకించారు. అయితే రాజీకయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఆయన తలొగ్గక తప్పలేదు. మంగళవారం ఈ బిల్లును ప్రతినిధుల సభ ముందుకు తీసుకు రాగా 427-1 ఓట్లతో ఆమోదం పొందింది. సెనెట్‌లో ఏకగ్రీవ ఆమోదం లభించిన తర్వాత ఈ బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. ఇక, న్యాయశాఖ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన అన్ని ఫైల్స్‌తో పాటు 2019లో జైలులో అతడి మరణంపై జరిగిన దర్యాఫ్తు సమాచారాన్ని కూడా నెల రోజుల్లో విడుదల చేయాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి..

ఆ సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయనున్న మెటా.. ఆస్ట్రేలియాలో కొత్త రూల్స్..

నా తల్లిని భారత్ రక్షించింది.. ప్రధాని మోదీకి రుణపడి ఉంటాం: షేక్ హసీనా కుమారుడు


మరిన్ని అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 20 , 2025 | 01:47 PM