Share News

Trump H-1B visas: విదేశీ ఉద్యోగులు లేకపోతే విజయం సాధించలేం.. ట్రంప్ యూటర్న్..

ABN , Publish Date - Nov 20 , 2025 | 02:01 PM

వలస విధానాలు, హెచ్-1బీ వీసాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. విదేశీ ఉద్యోగులు అమెరికన్ల ఉద్యోగాలను లాక్కుంటున్నారని హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసిన ట్రంప్ తాజాగా వెనక్కి తగ్గారు. అమెరికాకు విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని బహిరంగ వేదికపై అంగీకరించారు

Trump H-1B visas: విదేశీ ఉద్యోగులు లేకపోతే విజయం సాధించలేం.. ట్రంప్ యూటర్న్..
Trump foreign workers support

మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (MAGA) నినాదంతో స్థానిక అమెరికన్లను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా తన స్వరం మార్చారు. వలస విధానాలు, హెచ్-1బీ వీసాల విషయంలో యూటర్న్ తీసుకున్నారు. విదేశీ ఉద్యోగులు అమెరికన్ల ఉద్యోగాలను లాక్కుంటున్నారని హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసిన ట్రంప్ తాజాగా వెనక్కి తగ్గారు. అమెరికాకు విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని బహిరంగ వేదికపై అంగీకరించారు (Trump foreign workers support).


అమెరికా-సౌదీ పెట్టుబడుల ఫోరంలో మాట్లాడుతూ విదేశీ ఉద్యోగుల అవసరం గురించి ట్రంప్ వ్యాఖ్యానించారు. 'అమెరికాలో చాలా పెద్ద సంఖ్యలో ప్లాంట్లను నిర్మించబోతున్నాం. దేశ ఆర్థిక వృద్ధికి ఇవి ఎంతగానో దోహదపడతాయి. ఈ ప్లాంట్లలో పని చేయడానికి అధిక నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను తీసుకు రావాల్సిన అవసరం ఉంది. బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిన కంపెనీలు స్థానిక నిరుద్యోగులను మాత్రమే నియమించుకుంటే విజయం సాధించలేవు' అని ట్రంప్ వ్యాఖ్యానించారు (H-1B visa dispute).


'అమెరికాలో పెట్టుబడి పెట్టే కంపెనీలు వేలాది మంది విదేశీ వృత్తి నిపుణులను తమతో తీసుకు రావాలి. వారు యూఎస్‌కు వచ్చి స్థానికులకు ఆ నైపుణ్యాలను నేర్పించి, ఆ తరువాత తిరిగి తమ స్వదేశాలకు వెళ్లవచ్చు. విదేశీ ఉద్యోగులను అనుమతించకపోతే మనం విజయం సాధించలేము' అని ట్రంప్ స్పష్టం చేశారు (MAGA heat comment). హెచ్-1బీ వీసాపై వైఖరి మార్చుకోవడంతో ట్రంప్‌నకు స్వంత మద్దతుదారుల నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. మాగా (మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్) మద్దతుదారులు ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఆ సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయనున్న మెటా.. ఆస్ట్రేలియాలో కొత్త రూల్స్..

నా తల్లిని భారత్ రక్షించింది.. ప్రధాని మోదీకి రుణపడి ఉంటాం: షేక్ హసీనా కుమారుడు


మరిన్ని అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 20 , 2025 | 02:01 PM