Share News

Rare Tick Borne Meat: అత్యంత అరుదైన సంఘటన.. బర్గర్ తిని వ్యక్తి మృతి..

ABN , Publish Date - Nov 18 , 2025 | 08:00 AM

పురుగు కుట్టడం ద్వారా పాడైన రెడ్ మీట్ బర్గర్ తిన్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆల్ఫా గాల్ సిండ్రోమ్ వచ్చి చనిపోయాడు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వర్జీనియాలోని ‘యూవీఏ హెల్త్’కు చెందిన పరిశోధకుల బృందం సదరు వ్యక్తి మరణంపై పరిశోధనలు చేసింది. ఓ నివేదికను వెలువరించింది.

Rare Tick Borne Meat: అత్యంత అరుదైన సంఘటన.. బర్గర్ తిని వ్యక్తి మృతి..
Rare Tick Borne Meat

అమెరికాలో అత్యంత అరుదైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. బర్గర్ తిని 47 ఏళ్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పురుగు కుట్టిన రెడ్ మీట్ వల్ల అతడికి ఆల్ఫా గాల్ సిండ్రోమ్ వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. 2024లో ఈ సంఘటన చోటుచేసుకుంది. వర్జీనియాలోని ‘యూవీఏ హెల్త్’కు చెందిన పరిశోధకుల బృందం సదరు వ్యక్తి మరణంపై పరిశోధనలు చేసింది. ‘ది జర్నల్ ఆఫ్ అలెర్జీ అండ్ క్లినికల్ ఇమ్యునాలజీ ఇన్ ప్రాక్టీస్’ పేరిట ఓ నివేదికను వెలువరించింది.


ఆ నివేదికలో ఏముందంటే.. న్యూజెర్సీకి చెందిన 47 ఏళ్ల ఆ వ్యక్తి 2024లో ఓ హోటల్‌కు వెళ్లాడు. నాన్ వెజ్ బర్గర్ ఆర్డర్ చేసుకుని తిన్నాడు. అయితే, బర్గర్‌లోని రెడ్ మీట్ ఓ పురుగు కుట్టడం కారణంగా పాడైంది. ఆ బర్గర్ తిన్న అతడికి గలాక్టోస్ ఆల్ఫా 1తో పాటు 3 గలాక్టోస్ అలర్జీ వచ్చింది. బర్గర్ తిన్న కొన్ని గంటల తర్వాత వాంతులు చేసుకోవటం మొదలెట్టాడు. కుటుంబసభ్యులు అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. రెడ్ మీట్ తిన్న తర్వాత ఆల్ఫా గాల్ సిండ్రోమ్ వచ్చి ఓ వ్యక్తి చనిపోవటం అమెరికాలో ఇదే మొదటి కేసు.


పోస్టుమార్టం రిపోర్టులో అతడు గుండెపోటు, శ్వాసకోశ సంబంధ, న్యూరోలాజికల్, పొట్టలో సమస్యల వల్ల చనిపోలేదని తేలింది. డాక్టర్లు చనిపోయిన వ్యక్తి అన్ని అవయవాలను నిశితంగా పరిశీలించారు. వాటిలో ఎలాంటి సమస్య కనిపించలేదు. చాలా పరీక్షలు చేసిన తర్వాత అతడు ఆల్ఫా గాల్ సిండ్రోమ్ వల్ల చనిపోయాడని తేల్చారు. ఆల్ఫా గాల్ సిండ్రోమ్ వచ్చిన వాళ్లు పాడైన మాంసాన్ని తినటం వల్ల కొన్ని సార్లు చనిపోయే అవకాశం ఉంది. ఆ వ్యక్తి విషయంలో అదే జరిగింది. ఆల్ఫా గాల్ సిండ్రోమ్‌ను నివారించలేము. టెస్టులో ఇది బయటపడుతుంది.


ఇవి కూడా చదవండి

ర్యాగింగ్ కలకలం... పొట్టు పొట్టు కొట్టుకున్న విద్యార్థులు

కుక్కకు అత్యంత ఘనంగా సీమంతం వేడుక

Updated Date - Nov 18 , 2025 | 08:19 AM