Share News

Eric Trump: మమ్దానీకి భారతీయులు నచ్చరు.. ట్రంప్ కుమారుడి కామెంట్

ABN , Publish Date - Nov 18 , 2025 | 10:04 PM

న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన మమ్దానీపై డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ మరోసారి విమర్శలు గుప్పించారు. మమ్దానీకి భారతీయులు నచ్చరని సంచలన కామెంట్ చేశారు. వాపపక్షవాద భావజాల వ్యాప్తిని సంప్రదాయవాదులు అడ్డుకోవాలని గతంలో కూడా ఎరిక్ ట్రంప్ పిలుపు నిచ్చారు.

Eric Trump: మమ్దానీకి భారతీయులు నచ్చరు.. ట్రంప్ కుమారుడి కామెంట్
Eric Trump Criticizes Mamdani

ఇంటర్నెట్ డెస్క్: న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించిన డెమాక్రటిక్ పార్టీ నేత, భారత సంతతికి చెందిన జొహ్రాన్ మమ్దానీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మమ్దానీకి భారతీయులు నచ్చరని తెలిపారు. ఫాక్స్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజాగా ఈ కామెంట్స్ చేశారు (Eric Trump Criticizes NY Mayor Elect Zohran Mamdani).

వామపక్షవాద తీవ్ర భావాలు అమెరికా నగరాలను మారుస్తున్నాయని ఎరిక్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషలిజం అనుకూల పాలనా విధానాలతో అమెరికా కార్పొరేట్ సంస్థలు ఇక్కట్ల పాలవుతున్నాయని అన్నారు. ఇదే మార్గంలో న్యూయార్క్ నగరం కూడా తిరోగమనంలో పయనిస్తోందని అన్నారు. ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత గొప్ప నగరంగా ఉన్న న్యూయార్క్ నగరం.. రాజకీయ విధానాల కారణంగా ఆ గుర్తింపును కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. నగర అవసరాలను అనుగుణంగా మమ్దానీ సోషలిస్టు విధానాలు లేవని విమర్శించారు. యూదులను ద్వేషించే, గ్రోసరీ దుకాణాలను జాతీయం చేయాలనుకునే, భారతీయులంటే పడని సోషలిస్టు, కమ్యూనిస్టు న్యూయార్క్ పాలకుడయ్యారని అన్నారు. ఇలాంటి ఆలోచలనకు బదులు న్యూయార్క్ నగర వీధుల్లో భద్రత, పరిశుభ్రత, పన్నుల హేతుబద్ధీకరణ వంటి చర్యలపై మమ్దానీ దృష్టి పెట్టాలని సూచించారు.


గతంలో కూడా ఎరిక్ ట్రంప్ మమ్దానీపై విమర్శలు గుప్పించారు. మమ్దానీ పాలన న్యూయార్క్‌కు విపత్కరమని కామెంట్ చేశారు. వామపక్ష భావజాల వ్యాప్తిని సంప్రదాయవాదులు అడ్డుకోవాలని కూడా పిలుపునిచ్చారు. కమ్యూనిస్టును న్యూయార్క్ మేయర్‌గా ఎన్నుకున్నారని విచారం వ్యక్తం చేశారు.

ఇక వచ్చే ఏడాది జనవరి 1న మమ్దానీ న్యూయార్క్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. మేయర్‌ ఎన్నికల్లో గెలిచిన తొలి ముస్లింగా, తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా, ఆఫ్రికాలో పుట్టిన వ్యక్తిగా మమ్దానీ ఇప్పటికే రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

ట్రంప్ కటాక్షం కోసం లాబీయింగ్.. పాక్ ఎంత ఖర్చు పెట్టిందో తెలిస్తే..

చైనాలో నేపాల్ కరెన్సీ నోట్ల ప్రింటింగ్.. 17 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 18 , 2025 | 10:10 PM