Home » America
భారత్‌తో తమ బంధాన్ని తెంచేందుకు చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయని రష్యా విదేశాంగ శాఖ తాజాగా పేర్కొంది. ఎన్నో ఒత్తిడుల మధ్య ఈ స్నేహానికి కట్టుబడి ఉన్న భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించింది.
అమెరికా డాల్లాస్ నగరంలో భారతీయడు చంద్ర నాగమల్లయ్య హత్య ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అమాయకుడైన చంద్రపై జరిగిన ఈ దాడి భారతీయ కమ్యూనిటీని ఉలిక్కిపడేలా చేసింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు.
చైనాపై నాటో దేశాలు 100 శాతం వరకూ సుంకాలు విధించాలంటూ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పిలుపునివ్వడంపై చైనా స్పందించింది. ఈ ఆంక్షలు పరిస్థితిని మరింత జటిలం చేస్తాయని హెచ్చరించింది. చైనా ఎప్పటికీ యుద్ధాన్ని కోరుకోదని విదేశాంగ శాఖ మంత్రి పేర్కొన్నారు.
ఇప్పటికే అమెరికా విధించిన 50 శాతం సుంకాలతో సతమతమవుతున్న భారత్‌పై మరో పిడుగు పడనుందా? ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు భారత్, చైనాలను లక్ష్యంగా చేసుకోవాలని జీ7 దేశాలు భావిస్తున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.
భారత్‌పై సుంకాలు విధించడం అంత సులభమైన వ్యవహారం కాదని డొనాల్డ్ ట్రంప్ తాజాగా అన్నారు. అయితే, రష్యాకు ముకుతాడు వేసేందుకు సుంకాలు విధించానని తెలిపారు. ఇప్పటికే ఏడు యుద్ధాలను కూడా ఆపానని మరోసారి ఫాక్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ అన్నారు.
కిర్క్ హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తి పోలీసులకు చిక్కాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, అతడి పేరు, ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు.
కిర్క్ హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న ఓ యువకుడి ఫొటోను అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ తాజాగా విడుదల చేసింది. ఫొటోలోని యువకుడి గురించి తెలిసిన వారు అతడి వివరాలను తమకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యకు నిందితుడు వాడిన హైపవర్డ్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడి ఫొటో కూడా లభించిందని, దర్యాప్తు కొనసాగుతున్నందున దాన్ని విడుదల చేయలేమని అధికారులు తెలిపారు.
ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యోదంతం అమెరికాలో కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి వైరల్ అవుతున్న కొన్ని వీడియోల్లో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ (31) దారుణమైన కాల్పుల ఘటనలో మరణించారు. ఉటాహ్ వాలీ విశ్వవిద్యాలయంలో అమెరికన్ కమ్ బ్యాక్ టూర్ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.