Share News

Massive Fire In Birmingham: అమెరికాలో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

ABN , Publish Date - Dec 05 , 2025 | 09:27 PM

బర్మింగ్‌హామ్‌లోని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు.

Massive Fire In Birmingham: అమెరికాలో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
Massive Fire In Birmingham

అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అలబామా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 13 మంది విద్యార్థులు బర్మింగ్‌హామ్‌లోని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఉంటున్నారు. 13 మందిలో హైదరాబాద్‌కు చెందిన ఉడుముల సహజ రెడ్డి, కూకట్‌పల్లికి చెందిన మరో విద్యార్థి ఉంటున్నారు. శుక్రవారం అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.


మంటలు మొదలైన కొద్దిసేపటికే దట్టమైన పొగ అపార్ట్‌మెంట్ మొత్తం వ్యాపించింది. విద్యార్థులు శ్వాస తీసుకోలేక అల్లాడిపోయారు. గట్టిగా కేకలు వేయటం మొదలెట్టారు. స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది లోపల చిక్కుకున్న 13 మంది విద్యార్థులను బయటకు తీసుకువచ్చారు. తెలుగు విద్యార్థులిద్దరూ తీవ్రంగా గాయపడ్డంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.


ఇవి కూడా చదవండి

బీఆర్ఎస్ పాలనలో గ్రామాలన్నీ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయి: కేసీఆర్

1000 ఇండిగో విమానాల రద్దు.. 15వ తేదీకి సర్వీసుల పునరుద్ధరణ

Updated Date - Dec 05 , 2025 | 09:33 PM