Share News

TANA Pickleball Tournament: తానా ఆధ్వర్యంలో విజయవంతంగా పికిల్ బాల్ టోర్నమెంట్..

ABN , Publish Date - Dec 09 , 2025 | 11:12 AM

పికిల్‌ బాల్ టోర్నమెంట్‌ను తానా విజయవంతంగా నిర్వహించింది. క్రీడలు దైనందిన జీవితములో ముఖ్య భాగమని, అందుకే ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందుతున్న పికిల్‌ బాల్ టోర్నమెంట్‌ని దిగ్విజయముగా నిర్వహించామని తానా న్యూ ఇంగ్లాండ్ రీజినల్ కోఆర్డినేటర్ మౌనిక మానికొండ తెలిపారు.

TANA Pickleball Tournament: తానా ఆధ్వర్యంలో విజయవంతంగా పికిల్ బాల్ టోర్నమెంట్..
TANA Pickleball Tournament

న్యూ ఇంగ్లాండ్‌లో భాగమైన బోస్టన్‌లో పికిల్‌ బాల్ టోర్నమెంట్‌ను తానా విజయవంతంగా నిర్వహించింది. క్రీడలు దైనందిన జీవితములో ముఖ్య భాగమని, అందుకే ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందుతున్న పికిల్‌ బాల్ టోర్నమెంట్‌ని దిగ్విజయముగా నిర్వహించామని తానా న్యూ ఇంగ్లాండ్ రీజినల్ కోఆర్డినేటర్ మౌనిక మానికొండ తెలిపారు. ఓడిన ప్రతి సారి, ఓటమి నుంచి నేర్చుకుంటూ, సరిదిద్దుకుంటూ జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ కృష్ణ ప్రసాద్ సోంపల్లి క్రీడాకారులకు వివరించారు.

TANA-1.jpg


మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్ విభాగాలలో 28 జట్లు పాల్గొన్నాయి. ఈ ఈవెంట్ ఐదు గంటలకు పైగా కొనసాగింది. 120 మందికి పైగా ఆటగాళ్లు అసాధారణ నైపుణ్యం, జట్టుకృషి, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. విజేతలు, రన్నర్లకు ట్రోఫీస్, షీల్డ్స్ సోర్స్ గ్రూప్ అఫ్ కంపెనీస్ అధినేత శ్రీ బోళ్ల బహుకరించారు. వాలంటీర్స్ రవి ఉప్పలపాటి, అనిల్ గోవాడ, గోపి నెక్కలపూడి, తిర్బు పారుపల్లి, వేణు కూనంనేని, సురేష్ దోనేపూడి టోర్నమెంట్ సజావుగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.

TANA-2.jpg


వారి ప్రయత్నాలను గుర్తించి, ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ యెండూరి ఎంతో ప్రశంసించారు. స్థానిక క్రీడాకారులు, యువతతో ప్రాంగణమంతా నిండి పోయింది. అందరకీ అల్పాహారం, ఫ్రూప్ట్స్, టీ ఏర్పాటు చేశారు. ప్రెసిడెంట్ డాక్టర్ నరేన్ కొడాలి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివ లింగ ప్రసాద్ చావా ఈ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు తమ సందేశంలో అందరకీ శుభాకాంక్షలు తెలియజేశారు.

TANA-3.jpg


ఇవి కూడా చదవండి

మైనంపల్లి సంచలన కామెంట్స్.. కేటీఆర్‌ మళ్లీ అమెరికా వెళ్లడం ఖాయం

రోడ్డు ప్రమాదంలో తిరుచానూరు ఆలయ పోటు కార్మికులు మృతి

Updated Date - Dec 09 , 2025 | 11:13 AM