Share News

India US relations: భారత్‌తో బలమైన బంధం.. చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా వ్యూహం..

ABN , Publish Date - Dec 09 , 2025 | 07:01 AM

భారత్‌పై భారీగా సుంకాలు విధించడం, హెచ్1బీ వీసా నిబంధనలను కఠినతరం చేయడం వంటి చర్యలతో భారత్-అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అమెరికా కాంగ్రెస్ నాయకులు మాత్రం భారత్‌తో బలమైన బంధాలను కోరుకుంటున్నారు.

India US relations: భారత్‌తో బలమైన బంధం.. చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా వ్యూహం..
US National Security Strategy

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నారు. అమెరికా, భారత్ సంబంధాలను క్షీణింపజేశారు. భారత్‌పై భారీగా సుంకాలు విధించడం, హెచ్1బీ వీసా నిబంధనలను కఠినతరం చేయడం వంటి చర్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అమెరికా కాంగ్రెస్ నాయకులు మాత్రం భారత్‌తో బలమైన బంధాలను కోరుకుంటున్నారు (US National Security Strategy).


తాజాగా అమెరికా కాంగ్రెస్ నాయకులు 'నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్' పేరుతో వార్షిక రక్షణ బిల్లును విడుదల చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత పరిస్థితులు నెలకొనేలా చూసేందుకు, చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌తో స్నేహాన్ని బలోపేతం చేసుకోవడం అత్యవసరమని అమెరికా వార్షిక రక్షణ బిల్లులో అమెరికా ప్రభుత్వం పేర్కొంది. చైనాతో సాగిస్తున్న వ్యూహాత్మక పోటీలో అమెరికా ఆధిపత్యం కొనసాగేలా చూడాలని, అందుకోసం విదేశాంగ మంత్రితో సమన్వయం చేసుకోవాలని రక్షణ బిల్లు సూచించింది (Indo-Pacific ally).


భారత్, అమెరికా దేశాల మధ్య 2008లో కుదిరిన పౌర అణు ఒప్పంద పురోగతిని సమీక్షించాలని, యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ సెక్యూరిటీ డైలాగ్ వంటి సంప్రదింపుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని తాజా బిల్లు పేర్కొంది (India US defense ties). అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్‌తో కూడిన క్వాడ్ కూటమి ద్వారా ముందడుగు వేయాలని, ద్వైపాక్షిక, బహుళ సైనిక విన్యాసాలు చేపట్టాలని, రక్షణ వాణిజ్యాన్ని పెంపొందించాలని, మానవతా సహాయం, విపత్తు ప్రతిస్పందనలో సహకారాన్ని విస్తరించుకోవాలని సూచించింది.


ఇవీ చదవండి:

మోదీజీ నాకు న్యాయం చేయండి ప్లీజ్.. పాక్ మహిళ ఆవేదన..

ఈ చిట్కాలతో పీసీఓఎస్, డయాబెటిస్‌ను అదుపు చేయండిలా...

Updated Date - Dec 09 , 2025 | 07:01 AM