Home » Amaravati
టీటీడీకి సంబంధించి కల్తీ నెయ్యి, పరకామణిలో చోరీ కేసులకు సంబంధించి తిరుపతిలో ముమ్మరంగా విచారణ జరుగుతోంది. ఒకవైపు సీఐడీ.. మరోవైపు సీబీఐ భాగస్వామ్యమున్న సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది.
పరకామణి చోరీ కేసుపై సీఐడీ జరుపుతున్న దర్యాప్తులో టీడీపీ జోక్యం ఉండదని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలంటూ ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్‌ను కోరారు. బుధవారం సాయంత్రం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహం కాన్ఫరెన్సు హాలులో ఆయన టీడీపీ నేతలతోపాటు సీఐడీ చీఫ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.
మదనపల్లెలో జరిగిన కిడ్నీ ఆపరేషన్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. కిడ్నీ డోనర్ నుంచి రిసీవర్ వరకూ కొందరు దళారులు ముఠాగా ఏర్పడి దందా సాగిస్తున్నారు. డయాలసిస్ కేంద్రాల్లో పనిచేస్తున్న టెక్నీషియన్, సిబ్బంది ద్వారా కొన్ని ఆసుపత్రులు, మరికొందరు వైద్యులు సంయుక్తంగా ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలా పాలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది.
జిల్లాలో కొన్ని కళాశాలల్లో ఒకేషనల్ కోర్సులో చేరితే తరగతికి హాజరుకానవసరం లేదు. పైగా మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. నమ్మశక్యం కావడం లేదా.. కానీ ఇది నిజం. వృత్తి విద్యా శాఖ నుంచే ఆయా కళాశాలలకు పరోక్ష సహకారం అందుతున్నట్లు ఆరో పణలు ఉన్నాయి.
ర్యాగింగ్ అనేది సరదా కాదనీ, అదొక అమానుషమైన విషయమని ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. ఎవరైనా ఎక్కడైనా ర్యాగింగ్‌కు పాల్పడినట్టు తమ దృష్టికి వస్తే జైలుకు పంపి కఠిన శిక్ష అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎస్వీయూనివర్సిటీ శ్రీనివాసా ఆడిటోరియంలో మంగళవారం స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అఫైర్స్ విభాగం ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించింది.
విజయవాడలో గత ఆదివారం జరిగిన 6వ మాస్టర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అక్వాటిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో తిరుపతికి చెందిన ఎ.వెంకటేష్(67), సి.జయశంకర్(58) ప్రతిభ కనబరిచారు. వేర్వేరుగా బ్యాక్, బ్రేస్ట్ స్టోక్, ఫ్రీస్టయిల్ విభాగాలలో వెంకటేష్ కు నాలుగు బంగారు, జయశంకర్‌కు రెండు చొప్పున సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నారు.
తన ప్రమేయం లేని చోరీ కేసుల్లో పోలీసులు వద్ద తన పేరు ప్రస్తావిస్తున్నాడనే కోపంతో మనోజ్‌ను హత్య చేశానని హరిప్రసాద్ విచారణలో చెప్పినట్టు అదనపు ఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు.
ప్రయాణికుల సౌకర్యార్థం కోయంబత్తూరు-మదార్ (వయా గుత్తి) ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కోయంబత్తూరు-మదార్ ప్రత్యేక రైలు (నం. 06181) ఈ నెల 13, 20, 27, డిసెంబరు 4 తేదీల్లోనూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 06182) ఈ నెల 16, 23, 30, డిసెంబరు 7 తేదీల్లో నడపనున్నట్లు వెల్లడించారు.
‘ఏంటి..! మీ ఆయన నా జేబులో ఉన్నాడా? తెచ్చి ఇవ్వడానికి’ ఇదీ ఓ బాధితురాలు స్టేషన్‌కు వెళితే ఎస్ఐ(SI) నుంచి వచ్చిన హూంకరింపుతో కూడిన సమాధానం. ఇలా కొందరు పోలీస్ అధికారులు బెదిరింపు ధోరణిలో సమాధానం ఇస్తుంటే...మరికొందరు దివ్యాంగులు అనే కనికరం కూడా చూపడం లేదు.
కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే భక్తులు శివాలయాలకు చేరుకుని మహాదేవుడిని దర్శించుకుంటున్నారు.