Home » Adilabad
ప్రత్యేకంగా తయారు చేసుకున్న జాకెట్‌లను ధరించి మహారాష్ట్ర నుంచి నిషేధిత దేశీదారు మద్యాన్ని గుట్టుగా రాష్ట్రంలోకి తీసుకువస్తున్న ముగ్గురిని ఆదిలాబాద్ ఎక్సైజ్ శాఖ అధికారులు శనివారం పట్టుకున్నారు.
ఆదిలాబాద్ డీసీసీబీ డైరెక్టర్ కిడ్నాప్, హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. తనను పనిలో నుంచి తీసివేసినందుకు.. అతడి వద్ద పనిచేస్తున్న డ్రైవరే పగ పెంచుకొని కిడ్నా్‌పకు పాల్పడినట్లు తేల్చారు.
నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బాసర వద్ద గోదావరి నదిలో మునిగి ఐదుగురు యువకులు మృతిచెందారు. అమ్మవారి దర్శనానికి హైదరాబాద్‌లోని చింతల్ ఏరియా నుంచి మొత్తం 18మంది భక్తులు వచ్చారు. ఈ క్రమంలో వారు స్నానం చేయడానికి స్థానికంగా ఉన్న గోదావరిలోకి దిగారు.
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన అన్నదాతలను పిడుగులు బలిగొన్నాయి. ఒక్కరు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు పిడుగుపాటుకు పొలంలోనే ప్రాణాలొదలగా.. మరో 12 మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు.
Kavitha Comments: పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పదేళ్లుగా ఎంతో ఆవేదనను అనుభవించానని.. అన్నింటినీ భరించుకుంటూ వచ్చానని చెప్పారు. పార్టీలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.
BJP Adilabad MP Nagesh: రేవంత్ ప్రభుత్వంపై బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ నగేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ విద్యార్థుల స్కాలర్ షిప్ కోసం గత అక్టోబర్‌లోనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినా రేవంత్ ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు.
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సివిల్ కాంట్రాక్టర్ గుట్ట ప్రవీణ్ (46) గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లుల కోసం గురువారం ఉదయం హైదరాబాద్ వెళ్లిన ప్రవీణ్ పనులు ముగించుకుని ఆదిలాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
Central Minister Nitin Gadkari: చీకటి ఉండే చోట వెలుగులు నింపాలని, ఆదిలాబాద్ జిల్లా ప్రజల సమ్యలు అర్థం చేసుకునే రోజు వచ్చిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పీఎం సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తోందని, రోడ్లు బాగున్న దేశాన్నే అభివృద్ధి చెందిన దేశంగా భావిస్తారని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
జొన్న లేప తిని 20 ఆవులు మృతి చెందగా.. మరో 20 ఆవులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఘటన ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం బుర్కపల్లిలో చోటు చేసుకుంది.
ఆ యువకులు కేంద్ర భద్రతా సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. దేశ సరిహద్దులో కీలక విధులు నిర్వర్తించే ‘ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ దళంలో కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు కానీ, వారి ధ్రువపత్రాల పరిశీలనలో అసలు విషయం బయటపడింది.