Home » ABN
త్వరలోనే కొడంగల్ ప్రజలు రైలు కూతను వినబోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొడంగల్ ప్రజల 70 ఏళ్ల కల త్వరలో నెరవేరబోతుందన్నారు. మరో తొమ్మిది నెలల్లో రైల్వే లైన్ ఏర్పాటు పనులు ప్రారంభంకానున్నాయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాతి అని మంత్రి సీతక్క తెలిపారు. ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాలకు వడ్డీ భారం లేకుండా ప్రభుత్వమే వాటిని చెల్లిస్తోందని పేర్కొన్నారు.
హైదరాబాద్ మహానగరంలోని వివిధ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా నిలిచిపోనుంది. నవంబర్ 26వ తేదీన.. ఒక్క రోజు పలు ప్రాంతాల్లో మంచి నీటి సరఫరా ఆగనుంది.
హైదరాబాద్లోని సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అత్యవసర విభాగంలో స్లాబ్ కుప్పకూలి ముగ్గురు కార్మికులు మరణించారు.
సుబ్రహ్మణ్య షష్ఠికి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మోపిదేవి, సింగరాయపాలెంలో కొలువు తీరిన శ్రీ వల్లీదేవ సేన సమేత శ్రీ సుబ్రహ్యణ్య స్వామి దేవాలయాలకు భక్తులు పోటెత్తుతారు. సింగరాయపాలెంలో షష్ఠి ఉత్సవాలు 11 రోజుల పాటు ఘనం నిర్వహిస్తారు.
బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర ముంబైలో మృతి చెందారు. ఆయన మృతి చెందడం పట్ల వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తమిళ రాష్ట్రంలోని థెన్కాసి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
ఉత్తరాఖండ్లో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
సీఎం చంద్రబాబు తన విజనరీతో అన్నతాతలకు పంచ సూత్రాలను అందిస్తున్నారని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. పంచ సూత్రాల ద్వారా రైతులు తమ ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్తో పోటీ పడతారని పేర్కొన్నారు.
అభివృద్ధికి కేరాఫ్గా సనత్నగర్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో 2014 తర్వాతనే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపెట్టామని పేర్కొన్నారు.