హైదరాబాద్ విభజన చారిత్రక అవసరం.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
ABN , Publish Date - Feb 11 , 2026 | 06:27 PM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదొక విప్లవాత్మక ముందడుగని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ని తెలంగాణ ప్రభుత్వం మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా విభజించింది. హైదరాబాద్‌ను మూడు డివిజన్లుగా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్(Addanki Dayakar మాట్లాడుతూ.. ‘గ్రేటర్ హైదరాబాద్ ను మూడు కార్పొరేషన్లుగా విభజించడం ద్వారా నగరానికి మంచి జరగబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా.. ఇది ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు. పబ్లిక్ డొమైన్‌లో పెట్టి, విపక్షాల అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని తెలిపారు.
చరిత్రాత్మక నిర్ణయం..
‘తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రాంతీయ కార్యాలయంలో నేరుగా సమస్యలు పరిష్కారం అవుతాయి. బీఆర్ఎస్ రాజకీయం కోసం మాట్లాడుతున్నారు. వాళ్లు అధికారంలో ఉన్న రోజుల్లో ఏమీ పట్టించుకోలేదు. రాజకీయాల కోసం ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వేగవంతమైన అభివృద్ధికి ఈ నిర్ణయం గొప్ప ఊతమిస్తుంది. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రాత్మక నిర్ణయం.. దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి...
ఎమ్మెల్యే సతీమణి డిజైనర్ స్టోర్‌లో చోరీ.. ఎట్టకేలకు నిందితుడి అరెస్ట్
కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సూటిప్రశ్న