అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంట్
ABN, Publish Date - Feb 11 , 2026 | 07:27 PM
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు మరో పీటీ వారెంట్ జారీ చేశారు. గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో వసూలు చేసినట్లు అంబటిపై ఆరోపణలు ఉన్నాయి.
అమరావతి: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు మరో పీటీ వారెంట్ జారీ చేశారు. గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్ వేశారు. 2023లో సంక్రాంతి లక్కీ డ్రా లాటరీ టికెట్లు అమ్మకాలపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు సబ్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో అంబటి రాంబాబుపై 2023 జనవరి 16న సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ లక్కీ డ్రా కేసులో తాజాగా పీటీ వారెంట్ జారీ అయింది.
ఈ వీడియోలు చూడండి:
వరంగల్ లో ముగిసిన ఎన్నికలు .. ఫలితాలపై ఉత్కంఠ.! |
ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్
Updated at - Feb 12 , 2026 | 06:56 AM