మంచు తుఫానులో చిక్కుకున్న గర్భిణిని రక్షించిన భారత సైన్యం..
ABN , Publish Date - Feb 11 , 2026 | 04:59 PM
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో మంచు తుఫానుల వల్ల దారిపొడవునా గడ్డకట్టే చలి, భారీగా పేరుకుపోయిన మంచు ఉన్నప్పటికీ, ప్రాణాలకు తెగించి గర్భిణిని కాపాడారు భారత సైన్యం. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన భారత సైన్యం పట్ల మరింత నమ్మకాన్ని పెంచిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భారీగా మంచు కురుస్తోంది. ఈ సమయంలో తంగ్ధర్ ప్రాంతంలో 26 ఏళ్ల గర్భిణికి వైద్య సాయం అత్యవసమని తెలియగానే భారత సైన్యం తక్షణమే స్పందించి రంగంలోకి దిగింది. కానీ.. అప్పటికే దారిపొడవునా భారీగా మంచు పేరుకుపోయింది. రోడ్డుపై వాహనాలు నడిచే పరిస్థితి లేదు. దీంతో సైనికులు ఆమెను స్ట్రెచర్‌పై మోస్తూ కిలోమీటర్ల దూరం నడిచారు. ఆ సమయంలో గర్బిణికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అత్యంత జాగ్రత్తగా ఒక్కొరుగా చేతులు మార్చుకుంటూ స్ట్రెచర్ మోస్తూ ఆస్పత్రికి తరలించారు. దీంతో సరిహద్దుల్లో శత్రువుల నుంచి రక్షించడమే కాదు.. ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ సామాన్యులకు అండగా నిలవడంలో తామెప్పుడూ ముందుంటామని నిరూపించారు సైనికులు. ఈ వీడియోను చూసి చాలా మంది భావోద్వేగానికి గురవుతున్నారు. సైన్యం స్ఫూర్తికి సెల్యూట్ చేస్తున్నారు.
ఈ వీడియో timesnownavbharat అనే యూజర్ ద్వారా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘మీ త్యాగాలకు, ధైర్యానికి సెల్యూట్’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘భారత సైన్యం అంటే కేవలం బలగం కాదు, అది ఒక భరోసా’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
దేశాన్ని అమ్మేశారు.. అమెరికాతో డ్రేల్ డీల్‌పై రాహుల్ గాంధీ
మన డేటా రక్షణకు చర్యలేవీ.. కేంద్రంపై రాహుల్ ప్రశ్నల వర్షం