Home » ABN
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ బీజేపీ నేతల కొట్లాటల పంచాయితీ ఢిల్లీకి చేరింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శల వ్యవహారపై బీజేపీ హై జాతీయ కమాండ్ సీరియస్ అయిందని సమాచారం.
రాజ్యాంగ దినోత్సవం, జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ విలువలను కాపాడుకుంటామని వారు పేర్కొన్నారు.
అయోధ్యలోని బాలరాముడి ఆలయంపై కాషాయం జెండాను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఎగురవేశారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు అయోధ్యకు తరలి వచ్చారు. ఈ రోజుకు మరో విశిష్టత కూడా ఉంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో మంగళవారం తీవ్ర గందర గోళం నెలకొంది.
మంగళవారం ఉదయం నాటికి స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు మధ్యాహ్నానికి మళ్లీ పెరుగుదలను నమోదు చేశాయి. అటు వెండి రేట్లు కూడా భారీగా ఎగబాకాయి. ప్రస్తుతం మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
భారతీయ సాంస్కృతిక చైతన్యానికి సాక్షిగా అయోధ్య నిలుస్తోందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రామభక్తుల సంకల్పం సిద్ధించిందని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీ బాంబు పేలుడు ఘటన తర్వాత భద్రతా సమస్యల కారణంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ ఏడాదిలో ఆయన పర్యటన రద్దవడం ఇది మూడోసారి.
లావాదేవీల చెల్లింపు నిమిత్తం నిత్యం బ్యాంకుకు వెళ్లేవారు డిసెంబర్ నెలలో ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ నెలలో మొత్తం 16 రోజులు సెలవులు, పైగా ఇయర్ ఎండింగ్ కాబట్టి.. కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
గ్యాస్ బండ ఎక్కువ రోజులు రావాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. తద్వారా గ్యాస్ ఆదా అవుతుంది.