Share News

హైదరాబాద్‌‌లో మరో భారీ మోసం..

ABN , Publish Date - Feb 12 , 2026 | 03:40 PM

హైదరాబాద్ మహానగరంలో నిత్యం ఏదో ఒక మోసం జరుగుతూనే ఉంటుంది. తాజాగా మరో మోసం వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ.75కోట్ల మోసం బహిర్గతమైంది.

హైదరాబాద్‌‌లో మరో భారీ మోసం..

హైదరాబాద్, ఫిబ్రవరి 12: హైదరాబాద్‌లో మరో భారీ మోసం వెలుగు చూసింది. ఇన్‌వాయిస్ పేరుతో భారీ మోసం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. దాంతో తీగ లాగితే డొంకంతా కదిలింది. వాణిజ్య పన్నుల శాఖ అధికారుల చేతివాటంతో దాదాపు రూ.32 కోట్ల మేర మోసం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

సుమారు రూ.75 కోట్లకు పైగా సరకులను ఇన్‌వాయిస్ లేకుండానే వాహనాల్లో తరలించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దాంతో ఈ కేసు దర్యాప్తును సీసీఎస్‌కు హైదరాబాద్ పోలీసులు అప్పగించారు. దీనిప సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎప్పటిలాగానే సాధారణ వాహనాల తనిఖీలను పోలీసులు చేపట్టారు. దీంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ శాసనసభ, శాసనమండలి వాయిదా

ఏపీ అసెంబ్లీలో ఏఐ ఆధారిత అటెండెన్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం

For More AP News And Telugu News

Updated Date - Feb 12 , 2026 | 04:06 PM