స్కూటర్‌ను ఢీకొట్టిన స్కూల్ బస్సు.. స్పాట్ లోనే ఇద్దరు చిన్నారులు..
ABN , Publish Date - Feb 11 , 2026 | 09:23 PM
నార్త్ బెంగళూరులోని తనిసంద్ర సమీపంలో ఒక స్కూల్ బస్సు స్కూటర్ ను ఢీకొట్టింది. అనంతరం కిందపడిన ఇద్దరి చిన్నారుల పైనుంచి దూసుకెళ్లడంతో వారిద్దరూ మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇంటర్నెట్ డెస్క్: నార్త్ బెంగళూరులోని తనిసంద్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు మలుపు వద్ద నిలిచి ఉన్న స్కూటర్ ని స్కూల్ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. హెన్నూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ క్వార్టర్స్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ నాగనగౌడ కూతురు, మేనకోడలుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కానిస్టేబుల్ నాగనగౌడ తన స్కూటర్ పై ఇద్దరు చిన్నారులను తీసుకొని వెళ్తున్నాడు. పాఠశాలకు వెళ్తున్న బస్సు మలుపు తీసుకుంటున్న సమయంలో స్కూటర్ ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పిల్లలు రోడ్డుపై పడిపోయారు, బస్సు వెనుక చక్రం వారిపైకి ఎక్కింది. వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లగా ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో నాగనగౌడకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం పిల్లల మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం యలహంక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సూటిప్రశ్న
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ షురూ..