Home » 2024
జిల్లా సర్వజన ఆస్పత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై అసిస్టెంట్ కలెక్టర్ బొలి ్లనేని వినూత్న దృష్టి సారించారు. ఇటీవల జరిగిన ఆస్పత్రి అభివృద్ధి క మిటీ సమావేశంలో పలు సమస్యలపై చర్చించారు. వాటిని పరిష్క రించే బాధ్యతను అసిస్టెంట్ కలెక్టర్‌కు కలెక్టర్ వినోద్‌కుమార్ అప్పగిం చారు.
వ్యాపారులు సిండికేట్ అయ్యారు. నగరపాలక సంస్థలో సంత, దినసరి మార్కెట్ రుసుము వసూలుచేసుకునే హక్కుకు సంబంధించి 2025-26 సంవత్సరానికి నిర్వహించిన వేలం అందుకు నిద ర్శనంగా నిలిచింది. వాస్తవానికి ఈ నెల 4న వేలం నిర్వహిం చారు.
గత వైసీపీ పాలనలో దెబ్బతిన్న పలు గ్రామీణ రోడ్లకు కనీసం ప్యాచ వర్క్‌లను చేయలేదు. అయితే కూటమి ప్రభుత్వం రాగానే గ్రామీణ రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. దీంతో ప్రయాణం సాఫీగా సాగుతుండడంతో ప్రయాణికులు, ప్రజలు ఆ నందం వ్యక్తం చేశారు.
పిల్లలకు పరిశు భ్రత, ఆరోగ్యంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించా లని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ సూచించారు. స్థానిక శారదా మున్సిపల్ స్కూల్ లో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగు నివారణ దినోత్స వాన్ని నిర్వహించా రు.
పారదర్శకత పాటిస్తూ ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ అధికారులకు సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమ వారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీతో పాటు, అనంతపురం ఆర్డీఓ కేశవులునాయుడు, మండలంలోని వివిధ శాఖల అధికారులు హజరయ్యారు.
నగరపాలక సంస్థ పరిధి లో చేసిన పనులకు బిల్లులు రాలేదని, రూ.3కోట్ల బిల్లుల పరిస్థితి సందిగ్ధం లో ఉందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు కాంట్రాక్టర్లు తెలిపారు. కార్పొ రేషన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, నగర కమిషనర్ బాలస్వామి వినతులు స్వీకరించారు.
మండలంలో చిరుతల సంచారం పెరిగింది. కొండ ప్రాంతాల్లో చిరుతలు.. మూగజీవాలపై దాడులు చేసి, చం పుతున్నాయి. దీంతో రైతులు, గొర్రెల కాపర్లు.. మూగజీవాలను కొండ ప్రాం తాలకు మేత కోసం తీసుకెళ్లాలంటే హడలిపోతున్నారు. ఈనెల 6న గోవిందరాయునిపేట సమీపంలోని మాల కొండ వద్ద ఎద్దుల సూరికి చెందిన గొర్రెల మందపై రెండు చిరుతలు దాడి చేశాయి. రెండు గొర్రెలను చంపే శాయి.
రైతులకు నాణ్యమైన విద్యుత అందిస్తాం అం టూ ప్రకటనలకే పరిమితం తప్ప అచరణలో లేదు. ఆత్మకూ రు సబ్‌స్టేషన పనితీరే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మండలంలో ఆత్మకూరు, వడ్డుపల్లి, సనపలలో మూడు సబ్‌స్టేషన్లు ఉన్నాయి. వడ్డుపల్లి, సనప సబ్‌స్టేషన్ల ద్వారా వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత సరఫరా చేస్తున్నారు.
మండలపరిధిలోని గొందిరెడ్డిపల్లి వద్ద ఉన్న ఏపీఐఐసీ ఎంఎస్‌ఎంఈ ఇండస్ర్టియల్ ఎస్టే ట్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తా మని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ఇండస్ర్టియల్ ఎస్టేట్‌లో ఉన్న ఎలైట్ బయో టెక్నాలజీస్ ల్యాబ్‌లో అరటి మొక్కల తయా రీని ఆమె శనివారం ఏపీఐఐసీ అధికారుల తో కలిసి సందర్శించారు. అరటి మొక్కలు తయారీ విధానం, అవి రైతులకు ఏ విదంగా ఉపయోగపడుతుందన్న అంశా ల గురించి తెలుసుకున్నారు.
రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. స్థానిక నీలం సంజీవరెడ్డి పీటీసీ స్టేడియంలో శనివారం రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ క్రీడా పోటీలు నిర్వహించారు. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కొండయ్య, రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన (మా) అధ్యక్షుడు లక్ష్మీపతిరాజు, కార్యదర్శి రాంప్ర సాద్ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు.