Share News

ROADS : గ్రామీణ రోడ్లకు మోక్షం

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:18 AM

గత వైసీపీ పాలనలో దెబ్బతిన్న పలు గ్రామీణ రోడ్లకు కనీసం ప్యాచ వర్క్‌లను చేయలేదు. అయితే కూటమి ప్రభుత్వం రాగానే గ్రామీణ రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. దీంతో ప్రయాణం సాఫీగా సాగుతుండడంతో ప్రయాణికులు, ప్రజలు ఆ నందం వ్యక్తం చేశారు.

ROADS : గ్రామీణ రోడ్లకు మోక్షం
After doing the patch work

శింగనమల, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ పాలనలో దెబ్బతిన్న పలు గ్రామీణ రోడ్లకు కనీసం ప్యాచ వర్క్‌లను చేయలేదు. అయితే కూటమి ప్రభుత్వం రాగానే గ్రామీణ రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. దీంతో ప్రయాణం సాఫీగా సాగుతుండడంతో ప్రయాణికులు, ప్రజలు ఆ నందం వ్యక్తం చేశారు. గత నెల 21 తేదీన ‘ఈ రోడ్లకు మోక్షం ఎప్పుడో..?’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చిన విషయం విదితమే. దీనిపై కూటమి పాలకులు, అధికారులు స్పందించి మండలలోని శింగనమల - రాచేపల్లి, గోవిందరాయుని పేట - ఈస్టు నరసాపురం, గార్లదిన్నె - శింగన మల, లోలూరు క్రాస్‌ - మదిరేపల్లి, కల్లూరు - తరిమెల రోడ్ల మరమ్మతులు పూర్తి చేశారు. ఆ రోడ్లపై ప్రయాణం సాఫీగా సాగుతుండడంతో ప్రజలు, ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Feb 12 , 2025 | 12:18 AM