Share News

ASSISTANT COLLECTOR : ఆస్పత్రిలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ పరిశీలన

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:26 AM

జిల్లా సర్వజన ఆస్పత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై అసిస్టెంట్‌ కలెక్టర్‌ బొలి ్లనేని వినూత్న దృష్టి సారించారు. ఇటీవల జరిగిన ఆస్పత్రి అభివృద్ధి క మిటీ సమావేశంలో పలు సమస్యలపై చర్చించారు. వాటిని పరిష్క రించే బాధ్యతను అసిస్టెంట్‌ కలెక్టర్‌కు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అప్పగిం చారు.

ASSISTANT COLLECTOR : ఆస్పత్రిలో  అసిస్టెంట్‌ కలెక్టర్‌ పరిశీలన
Assistant Collector Vinutna and medical officers are examining in the hospital

అనంతపురంటౌన, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): జిల్లా సర్వజన ఆస్పత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై అసిస్టెంట్‌ కలెక్టర్‌ బొలి ్లనేని వినూత్న దృష్టి సారించారు. ఇటీవల జరిగిన ఆస్పత్రి అభివృద్ధి క మిటీ సమావేశంలో పలు సమస్యలపై చర్చించారు. వాటిని పరిష్క రించే బాధ్యతను అసిస్టెంట్‌ కలెక్టర్‌కు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అప్పగిం చారు. దీంతో మంగళవారం అసిస్టెంట్‌ కలెక్టర్‌ జిల్లా ఆస్పత్రికి వచ్చా రు. ఆస్పత్రి ఆవరణంలో పాతబడి మూలన పడేసిన అంబులెన్సలను వెంటనే తీసివేయాలని ఆదేశించారు. ఆస్పత్రి ముందుభాగంలో ప్రహరీ కి ఆనుకుని ఏర్పాటు చేసుకున్న దుకాణాలను ఇంకోచోటికి తరలించి, అక్కడ వాహనాల పార్కింగ్‌ ఏర్పాటు చేసేందుకు వైద్యాధికారులు, ఇంజినీర్లతో చర్చించారు. అలాగే కోవిడ్‌ సెంటర్‌కు వినియోగించిన స్థలంలో రోగుల వెంటవచ్చిన వారి విశ్రాంతి భవనం ఏర్పాటుకు పరి శీలించారు. క్యాజువాలిటీ వద్ద పరిష్థితులపై అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఆరాతీ శారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వర రావు, ఆర్‌ఎంఓ డాక్టర్‌ రామక్రిష్ణ, డిప్యూటీ ఆర్‌ఎంఓలు డాక్టర్‌ హేమలత, డాక్టర్‌ పద్మజ, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ శ్రీనివాసులనాయుడు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Feb 12 , 2025 | 12:26 AM