Share News

PGRS : రూ. 3కోట్ల బిల్లులు పూర్తి చేయండి

ABN , Publish Date - Feb 11 , 2025 | 12:17 AM

నగరపాలక సంస్థ పరిధి లో చేసిన పనులకు బిల్లులు రాలేదని, రూ.3కోట్ల బిల్లుల పరిస్థితి సందిగ్ధం లో ఉందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు కాంట్రాక్టర్లు తెలిపారు. కార్పొ రేషన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌, నగర కమిషనర్‌ బాలస్వామి వినతులు స్వీకరించారు.

PGRS : రూ. 3కోట్ల బిల్లులు పూర్తి చేయండి
Contractors explaining to MLA Daggupati

పీజీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యేకి కాంట్రాక్టర్ల వినతి

అనంతపురం క్రైం, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి) : నగరపాలక సంస్థ పరిధి లో చేసిన పనులకు బిల్లులు రాలేదని, రూ.3కోట్ల బిల్లుల పరిస్థితి సందిగ్ధం లో ఉందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు కాంట్రాక్టర్లు తెలిపారు. కార్పొ రేషన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌, నగర కమిషనర్‌ బాలస్వామి వినతులు స్వీకరించారు. కాంట్రాక్టర్లు వేణుగోపాల్‌రెడ్డి, ప్రభాకర్‌ తదితరులు ఎమ్మెల్యేని కలిసి విన్నవించారు. 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి అన్ని మున్సిపల్‌ ఖాతాలలో డబ్బులుండేవని, ఆ డబ్బు అంతా వెనక్కు పంపాలని గత వైసీపీ ప్రభుత్వ హయంలో ఆదేశా లందాయ న్నారు. అన్ని మున్సిపాలిటీలలో బిల్లులు క్లియర్‌ చేసి పంపారని, అనంతపురం నగరపాలక సంస్థలో 18బిల్లులకు సంబంధించి రూ.3కోట్ల వర కు బిల్లులు క్లియర్‌ చేయకుండా మొత్తం రూ.12కోట్లు వెనక్కు పంపారని వారు పేర్కొన్నారు. ఏడాదిన్నరగా బిల్లుల సమస్య ఉందని, త్వరగా పరిష్కరించాలని వారు ఎమ్మెల్యేని కోరారు.


అమ్మవారి వంకలో ఆక్రమణలపై చర్యలు తీసుకోండి

నగరంలోని మరువవంకకు కలిసే అశోక్‌నగర్‌లోని అమ్మవారి వంకపై ఆక్రమణలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ తెలుగు యువత అధికార ప్రతినిధి వెంకటరామయ్య ఎమ్మెల్యేని కోరారు. గత ప్రభుత్వ హయాంలో సరైన ప్రణాళిక లేకుండా అశోక్‌నగర్‌ ప్రధాన రహదారిలో వంకపై బ్రిడ్జి నిర్మించారని, దీంతో జీరో క్రాస్‌ రోడ్డు పూర్తిగా కనుమరుగై రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోందన్నారు.వంక చుట్టూ కట్టిన అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదు : ఎమ్మెల్యే

నగరపాలిక పరిధిలో కార్పొరేషన స్థలాలను కబ్జా చేసే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ అన్నారు. స్థానిక సమస్యలపై పలురు వినతి పత్రాలు అందజేశాన్నారు. సెంట్రల్‌ పార్క్‌లో సర్వే చేపట్టి, ఆక్రమించిన స్థలాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ప్రసన్నాయపల్లి వద్ద 20 ఎకరాల స్థలం కబ్జాకు గురైందని, తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Feb 11 , 2025 | 12:17 AM