Share News

MLA : ఆరోగ్యంపై పిల్లలకు వివరించాలి

ABN , Publish Date - Feb 11 , 2025 | 12:23 AM

పిల్లలకు పరిశు భ్రత, ఆరోగ్యంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించా లని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ సూచించారు. స్థానిక శారదా మున్సిపల్‌ స్కూల్‌ లో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగు నివారణ దినోత్స వాన్ని నిర్వహించా రు.

MLA : ఆరోగ్యంపై పిల్లలకు వివరించాలి
MLA Daggupati speaking in the meeting

నులిపురుగు నివారణ దినోత్సవంలో ఎమ్మెల్యే దగ్గుపాటి

అనంతపురం అర్బన, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): పిల్లలకు పరిశు భ్రత, ఆరోగ్యంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించా లని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ సూచించారు. స్థానిక శారదా మున్సిపల్‌ స్కూల్‌ లో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగు నివారణ దినోత్స వాన్ని నిర్వహించా రు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ విద్యార్థుల సంక్షేమం, చదువు కోసం ఎంతో ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే పలువురు విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేశారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ వినూత్న, డీఎంహెచఓ ఈబీ దేవి, నగర కమిషనర్‌ బాలస్వా మి, ఐసీడీఎస్‌ పీడీ వనజాఅక్కమ్మ, డీఈఓ ప్రసాద్‌బాబు, సీడీపీఓ లలిత, డిప్యూటీ మేయర్‌ కోగటం విజయభాస్కర్‌రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

నులిపురుగుల నివారణతో సంపూర్ణ ఆరోగ్యం

గార్లదిన్నె, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : నులిపురుగుల నివారణతోనే సంపూర్ణ ఆరోగ్యమని వైద్యాధికారి గౌతమి పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా సోమవారం మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌, అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల కు ఆల్బెండ జోల్‌ మాత్రలు పంపిణీ చేశారు. ఎంపీడీఓ యోగానంద రెడ్డి, ఎంఈఓ తారాచంద్రానాయక్‌, ఈఓఆర్డీ దామోదరమ్మ, ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ జ్యోతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Feb 11 , 2025 | 12:23 AM